త‌ల‌కిందులుగా జాతీయ ప‌తాకం.. ఏపీ మంత్రి నిర్వాకం

జాతీయ ప‌త‌కాన్ని గౌర‌వించ‌డం ప్ర‌తి పౌరుడి బాధ్య‌త‌. అందులోనూ ముఖ్యంగా రాజ్యాంగ ప‌దవుల్లో ఉన్న‌వారు. అధికారులు చాలా జాగ్త‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. దానిని ఆవిష్క‌రించ‌డంలోనూ… అవ‌న‌తనం చేయ‌డంలోనూ జాగ్ర‌త్త‌లు పాటించాలి. పొర‌పాట్లు దొర్ల‌కుండా చూసుకోవాలి. గ‌ణ‌తంత్ర వేడుకల సంద‌ర్భంగా మ‌రీనూ. కానీ కొంద‌రు నాయ‌కులు ఇప్ప‌టికీ దానిని మొక్కుబ‌డిగా నిర్వ‌హిస్తూ, ఏమాత్రం ప‌ట్టింపులేకుండా చేస్తూ గౌర‌వాన్ని మ‌స‌క‌బారుస్తున్నారు. ఇంత‌కు ముందూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. తాజాగా వారి జాబితాలోకి ఏపీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ చేరిపోయారు. వైఎస్సాఆర్ విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర శాఖ నిర్వ‌హించిన గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో పాల్లొగ‌న్న ఆయ‌న ఏదీ గ‌మ‌నించ‌కుండానే జాతీయ ప‌తాకాన్ని త‌ల‌కిందులుగా ఎగ‌ర‌వేసి అప‌హాస్యం పాల‌య్యారు. జాతీయ ప‌తాకం గౌర‌వాన్ని కించ‌ప‌రిచారు. ఆ సంగ‌తిని అక్క‌డి వారేవ‌రూ గ‌మ‌నించ‌కుండానే జాతీయ గీతాన్ని ఆల‌పించ‌డం గ‌నార్హం. అనంత‌రం తేరుకున్న నాయ‌కులు వెంట‌నే జెండా దించి స‌రిచేసి మ‌రోసారి ఎగ‌రేశారు.

దీనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అమాత్యుడై ఉండి ఇలా చేయ‌డ‌మేంట‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు సైతం ఆయ‌న‌పై తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. తిట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. విప‌క్ష టీడీపీ నేత‌లు ఆ వీడియోల‌ను ట్రోల్ చేస్తున్నారు. వైసీపీని ఉద్దేశించి ఈ రివ‌ర్స్ గ్యాంగ్ జాతీయ ప‌తాకాన్నే కాదు. అభివృద్ధిని కూడా రివ‌ర్స్ చేస్తున్న‌ద‌ని కామెంట్లు పెడుతున్నారు.

Tags: ap minister avanthi srinivas, vishakapatnam ysrcp leaders