శాసనమండలిలో ప్రభుత్వ బిల్లులను అడ్డుకున్నామనే ఆనందం అంతలోనే ఆవిరైంది టీడీపీ. ఊహించినట్లుగానే ఓ ఉపద్రవం మీదకు దూసుకొచ్చింది. టీడీపీ ప్రభత్వంలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరిపై సీఐడీ కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. మిగతా తెలుగుతమ్ముళ్లలో ఆందోలనలను రేకేత్తిస్నుది. ఇంతకీ విషయమేమిటంటే రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచీ వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నది. ముఖ్యమంతి పలువురు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యే భారీ మొత్తంలో బినామీల పేరుతో భూములను కొనుగోలు చేశారని తెలుపుతున్నది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత భూముల క్రయవిక్రయాలపై సీఐడీ విచారణ చేపట్టింది. దర్యాప్తును ముమ్మరం చేసింది.
ఇప్పటికే తెల్లకార్డు ఉన్న సుమారు 796 మంది ఎకరం రూ. 3కోట్ల చొప్పున దాదాపు 761 ఎకరాలను కొనుగోలు చేశారని సీఐడీ వెల్లడించింది. అంతటితో ఆగకుండా వారిపై కేఉలను నమోదు చేసింది. వారితో ఆ భూములను ఎవరు కొనిపించారనే కుపీని లాగుతున్నది. తాజాగా అప్పటి టీడీపీ మంత్రులుగా ఉన్న పత్తిపాటి పుల్లారావు, నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. వారిద్దరూ అసైన్డ్ భూములను కొన్నారని అధికారులు వెల్లడించడం రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు తెరతీసింది. దీంతో మిగతా తెలుగు తమ్ముళ్లలో ఆందోలన చెలరేగింది. తమపై ఎక్కడ కేసులు నమోదవుతాయోనని వారు ఆందోలనకు గురవుతున్నట్లు సమాచారం.