టీడీపీకి ఎమ్మెల్సీ,మాజీ మంత్రి డొక్కా రాజీనామా?

ఏపీ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత రసవత్తరంగా మారాయి. టీడీపీకి పూర్తి మెజార్టీ ఉన్న మండలిలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వైసీపీ గట్టించుకుంటుందా? అని సర్వత్రా ఉత్కంఠతగా ఎదురుచూస్తుంటే అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యంలో ముచెత్తింది. టీడీపీ ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేసి అటు అధినేతను చంద్రబాబును, పసుపు పార్టీ నేతలను షాక్‌కు గురిచేశారు. ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. రాజధాని తరలిపోతున్నందుకు బాధగా ఉందని, అందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నానని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అవకాశాన్ని కల్పించిన పార్టీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అదీగాక భవిష్యత్‌లో ఎలాంటి రాజకీయ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన ప్రకటించడం గమనార్హం.

ఇదిలా ఉండగా ఇది వైసీపీ మైండ్‌ గేమ్‌నా? లేక మరేదైనా? అని ఏపీ రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే రాజధాని బిల్లుల ఆమోదం కోసం మంత్రి బొత్స తమ పార్టీ ఎమ్మెల్సీలకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి యనమాల రామకృష్ణుడు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు సభకు కూడా హాజరుకావడం లేదని సమాచారం. అందులో శమంతకమణి, రత్నబాయి ఉన్నారు. ఈ నేపథ్యంలో డొక్కా రాజీనామా చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది. వైసీపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నది. మండలిలో బిల్లుల ఆమోదం కోసం గట్టి ప్రయత్నాలనే చేస్తున్నదని తెలుస్తున్నది.

Tags: CHNDRA BABU, EX MINISTER DOKKA, MLC, RESIGNATION