క్రిష్‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పిరియాడిక‌ల్ డ్రామా మొద‌లైంది..

రెండేళ్ల విరామం అనంత‌రం తిరిగి సినిమాల‌కు రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ దూకుడును పెంచారు. వ‌రుస‌గా సినిమాల‌ను ప‌ట్టాల‌ను ఎక్కిస్తున్నారు. ఇప్ప‌టికే బాలివుడ్‌లో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న పింక్ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు రీమెక్ చేస్తున్న విష‌యం తెలిసిందే.,ఆ సినిమాకు వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, అందులో ఆయ‌న హిందీలో అమితాబ్‌బ‌చ్చ‌న్ పోషించిన కీలక న్యాయ‌వాది పాత్ర‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోషించ‌నున్నారు. ఆ సినిమా షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభంకాగా, చిత్రీక‌ర‌ణ‌లో ప‌వ‌న్ సైతం పాల్లొంటున్నాడు.

తాజాగా ప్యాన్ ఇండియా స్థాయిలో , భారీ బ‌డ్జెట్‌తో విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు జగర్ల‌ముడి క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ పిరియాడిక‌ల్ డ్రామా చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న విష‌యం తెల‌సిందే. ఆ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఎఆర్ ర‌త్నం నిర్మిస్తున్నారు. స్క్రిప్ట్ వ‌ర్క్‌ను పూర్తి చేసిన క్రిష్ ప్రస్తుతం మిగిలిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల ఎంపిక‌లో బిజీగా ఉన్నాడు. ప్యాన్ ఇండియాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌తో సహా పలు పరిశ్రమలకు చెందిన దిగ్గ‌జ నటులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌నున్న‌ట్లు టాలివుడ్ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు ఈ చిత్రంలో విల‌న్ పాత్ర‌ను పోషించ‌నుండ‌గా, ఇద్దరు ప్రముఖ అగ్ర‌తార‌లు నటించనున్నారు. ఈ చిత్రాని్న ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయాల‌నే ప్ర‌ణాళిక‌తో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ముందుకు సాగుతున్నారు.

Tags: jagarlamudi krish, pawankalyan, periadical drama movie