టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఎక్కువగా పోలీసాఫీసర్‌గా నటించిన పాత్రలే ఎక్కువ. ఇక సామాజిక పాత్రల్లోనూ కనిపించి కనువిందు చేసిన ప్రిన్స్ మహేష్‌బాబు ఎప్పుడు చూడని సరికొత్త పాత్రలో నటించే అవకాశం ఉంది. పోకిరి సినిమాలో అండర్ కవర్ ఆపరేషన్‌లో కనిపించి అలరించిన ప్రిన్స్ ఇప్పుడు ఓ సినిమాలో పూర్తిస్థాయిలో కొత్తపాత్ర చేయబోతున్నట్లు సమాచారం. ఇంతకు ప్రిన్స్ మహేష్‌బాబు నటించబోయే సినిమా ఎవరితో.. ఏ పాత్రలో నటించబోతున్నాడు.
సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు వంశీ పైడిపల్లి. మహర్షి సినిమా తరువాత మరే సినిమాను వంశీ ఒప్పుకోలేదు. మహేష్‌బాబు మహర్షి సినిమాను పూర్తి చేసి సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాలో నటిస్తున్నాడు. అ సినిమా పూర్తి కాగానే ప్రిన్స్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడైన వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శకడు. వాస్తవానికి మొదటి నుండి వంశీ పైడిపల్లి తన ఆరవ సినిమాను మహేష్‌తోనే చేయాలని అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. చాలా రోజులు ఈ వార్తలపై స్పండించని పైడిపల్లి తాజాగా మహేష్ బాబుతోనే తర్వాతి సినిమాను చేయాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు.
మహేష్‌బాబుతో తదుపరి చేయబోయే సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారు అని చిత్ర సీమలో ప్రచారం జరుగుతుంది. మహర్షి నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. అయితే ఈసినిమాలో మహేష్‌బాబు ఓ గ్యాంగ్‌స్టర్‌గా నటించబోతున్నారు. ఇప్పటి దాకా మహేష్‌బాబు గ్యాంగ్ స్టర్‌గా ఎప్పుడు నటించలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబందించిన స్టొరీ సిట్టింగ్స్ దిల్ రాజుతో జరుగుతున్నాయని సమాచారం. సరిలేరు నీకెవ్వరూ చిత్ర షూటింగ్ కాశ్మీర్లో జరుగుతున్న సందర్భంలో కూడా వంశీ పైడిపల్లి అక్కడే మహేష్‌బాబుతో కమిట్మెంట్ చేసుకున్నాడని టాక్. ఇకపోతే మహేష్ తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు వచ్చే యేడాది జనవరి 11న విడుదలకానుంది.