మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 152వ చిత్రం కోసం చేస్తున్న కసరత్తుల అంతా ఇంతా కాదు. మెగాస్టార్ కండల కోసం కసరత్తా లేక.. అందం కోసం ఆరాటమో తెలియదు. చిరంజీవి కసరత్తులతో రోజు రోజకు స్లిమ్‌గా తయారవుతున్నారు. అందుకు మెగాస్టార్ చేస్తున్న కసరత్తులతో తన సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తిని కలిగేలా చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డిలో బొద్దుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఓ నక్సలైట్ పాత్రలో నటించబోతున్నాడు మెగాస్టార్. అయితే నక్సలైటుగా తాను నటించాలంటే కొంత ఫిట్నెస్ గా కూడా ఉండాలి. చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు ఎక్కడం దిగడం వంటి సన్నివేశాలు ఎలాగు ఉంటాయి. అందుకే ఇప్పుడు జిమ్‌లో కష్టపడితే సినిమా షూటింగ్లో అంతా సవ్యంగా ఉంటుంది. లేకుంటే ఇబ్బందులు పడక తప్పదు.
మెగాస్టార్ తన కేరీర్లో నటించబోయే ఈ చిత్రం ఓ సామాజికాంశంతో ముడిపడి ఉంటుందని ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించబోతున్నారు. ఈనెల చివరి వారంలో చిత్ర షూటింగ్ సెట్స్ మీదకు వెళ్ళనున్నది. అయితే చిత్ర షూటింగ్ ప్రారంభయ్యేలోగా జిమ్‌లో కసరత్తులతో కుస్తీలు పడుతున్నాడు. డంబుల్స్ చేతిలో పట్టుకుని, ట్రైనర్ పర్యవేక్షణలో చేస్తున్న కసరత్తు చూస్తే ఈ సినిమాలో కండల వీరుడిగా, అందమైన చిరుగా కనివిందు చేయబోతున్నారు. జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఫోటోను కొద్ది సేపటి క్రితం తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో తెగ వైరలవుతుంది.