ఒక్కో గ్రామంలో వెయ్యి మంది పోలీసులా: నారా లోకేష్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నట్లుగా లేదని, పోలీసు రాజ్యం నడుస్తున్నట్లుగా ఉన్నదని ఆయన దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ఆందోళనలు, నిరసనలు, అధికార, ప్రతిపక్ష నేతల పరస్పర విమర్శలతో రాజధాని గ్రామాలు అట్టుడుకిపోతున్నాయి. శనివారం నిరసన వ్యక్తం చేస్తున్న రాజధాని ప్రాంతం మహిళలపై పోలీసులు దౌర్జన్యకాండకు దిగారు. దీనిపై మాజీ మంత్రి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. ట్విట్టర్‌లో ఘాటుగా విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజధాని ప్రాంతాల్లోని ఒక్కో గ్రామంలో వెయ్యిమంది రైతులను కాపాలా పెట్టారని ఆరోపించారు. పోలీసులు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలను ఇళ్లలో బంధించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వం చిచ్చు రేపుతున్నదని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అదీగాక గ్రామాల్లో పోలీసుల కవాతుకు సంబంధించిన ఓ వీడియోను నారా లోకేష్‌ పోస్టు చేశారు.

Tags: condemd police laati charge, fairs on ap govt, naralokesh