ఎస్వీబీసీ చైర్మన్‌గా ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ?

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని వేంకటేశ్వర భక్తి చానల్‌ చైర్మన్‌ పదవి సినీనటుడు పృథ్వీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ పదవి హస్య చిత్రాల దర్శకుడిన వరించనున్నట్లు సమాచారం. దివంగత వైఎస్సార్‌కు సన్నిహితుడైన ఆయన పేరే దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నది. అధికార ప్రకటన ఒకటే లాంఛనంగా మిగిలిందని పలువురు సినీ వర్గాలు తెలుపుతున్నాయి. చానల్‌కు చెందిన ఓ ఉద్యోగినితో నటుడు పృథ్వీ సరస సంభాషణలు సాగించడం, సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో విడుదల కావడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో పృథ్వీపై ఇంటా బయటా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహర్‌రెడ్డి సైతం ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదీగాక వెంకన్న భక్తులు, పలు ప్రజాసంఘాలు పృథ్వీని ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి నుంచి తప్పించాలని బాహాటంగానే డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పృథ్వీ చైర్మన్‌ పదవికి రాజీనామా సమర్పించారు.

అయితే ప్రస్తుతం ఆ పదవి కోసం చాలా మంది సినీ ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పైరవీలను చేయడం మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే ఎస్వీబీసీ చైర్మన్‌గా ప్రముఖ హస్య చిత్రాల దర్శకుడు భీమిలి శ్రీనివాస్‌రెడ్డి పేరు ఖరారైనట్లు సమాచారం. ఆయన దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. దీంతో ఆ పదవి ఆయనకే దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా శ్రీనివాస్‌రెడ్డి, కుబేరులు, టాటా లైలా మధ్యలో బిర్లా తదితర సక్సెస్‌ చిత్రాలను తీసి పేరొ సంపాదించారు.

Tags: actor prudwi resign, cm jagan mohanreddy, svbc chairman