చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలు అనాది నుంచి వస్తున్నాయి. ముందుగా ఎక్కువగా ఒకేరమైన పద్దతిలో మల్టీస్టారర్ చిత్రాలు వచ్చాయి. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామేత ప్రకారం ఇప్పుడు అదే ఫార్మూలాను చిత్ర పరిశ్రమలో ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అందరు చిత్ర దర్శకులు, నిర్మాతలు, హీరోలు, నటులు అందరు మల్టీస్టారర్ చిత్రాల వైపు దృష్టి సారించారు. ఆనాటి నుంచి నేటి వరకు మల్టీస్టారర్ చిత్రాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాలకు పెద్ద పీట వేసేందుకు అందరు ఆలోచిస్తున్న తరుణంలో మరో బిగ్‌న్యూస్ చిత్ర పరిశ్రమలో హల్‌ఛల్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో చిత్రాల్లో మరో స్టార్‌తో సినిమాలను పంచుకున్నారు. ఇంకా అనేక మంది అగ్ర హీరోలు కూడా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించి రాణించారు. ఇప్పుడు అదే ట్రెండ్‌కు పెద్ద పీట వేస్తున్న తరుణంలో ఇటీవల ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడుకి మెగా ఫ్యామిలీ నుంచి బంఫర్ ఆఫర్ ఇచ్చిందని సమాచారం. మెగాస్టార్ కుటుంబం నుంచి ఓ మల్టీస్టారర్ చిత్రానికి అంకురార్పణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ఈ దర్శకుడిని ఇప్పటికే సంప్రదించినట్లుగా చిత్రి సీమలో ప్రచారం జరుగుతుంది.
అంతలా మెగాస్టార్ కుటుంబం మల్టీస్టారర్ చిత్రం వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో ఆ మల్టీస్టారర్ చిత్రంను రూపొందించేందుకు ఏ దర్శకుడిని సంప్రదించింది అనుకుంటున్నారా.. ఆయనే బాబీ. రేపు విడుదల కానున్న వెంకిమామ చిత్రాన్ని రూపొందించిన బాబీతో సినిమా చేయాలనే ఆలోచన చేస్తుందని సమాచారం. మెగా కుటుంబం నుంచి రాబోయే మల్టీస్టారర్ చిత్రంకు బాబీని దర్శకుడు గా ఎంపిక చేయనున్నారని టాక్. ఇక ఇప్పుడు వెంకిమామ చిత్రం విడుదల అయితే బాబీ ఏమేరకు చిత్రాన్ని రూపొందించారో కొద్ది గంటల్లో తేలిపోనున్నది. ఇప్పుడు మెగా కుటుంబం నుంచి మల్టీస్టారర్ రానున్నదనే సంకేతం ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌టాఫిక్‌గా మారింది.