అది మొగల్తూరు… ఆ ఊరుకు చెందిన వెంకట్రావ్.. అతడికి అంజలీ దేవితో వివాహం అయింది. కొత్త కాపురం.. కొత్త జంట.. అప్పటికే అమె నిండు చూలాలు.. అది 1955వ సంవత్సరం.. ఆ నిండు చూలాలైన అంజలీదేవి సినిమాకు చూడాలని ఉందని వెంకట్రావ్‌ను అడిగింది. అందుకు తను ఓకే అన్నారు. ఓ జట్కా బండిపై వెళుతున్న క్రమంలో అది అదుపు తప్పి బొల్తా పడింది. అందరు కింద పడ్డారు.. దెబ్బలు మాములుగా తగిలినా.. సినిమా చూసే ప్రయత్నం ఆపలేదు. అదే బండిలో నరసాపురం వెళ్ళి సినిమా చూసారు..
అలా సినిమా చూసిన దంపతులిద్దరు సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. అయితే ఇద్దరు దంపతులు చూసింది రోజులు మారాయి సినిమా. అందులో హీరో మహనటుడు అక్కినేని నాగేశ్వర్రావు. అంజలిదేవి కడుపులో ఉన్న బిడ్డ ఈ.. మీ.. మెగాస్టార్ చిరంజీవి అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. అంటే మహనటుడి సినిమాలు అంటే అమ్మ అంజలీదేవికి ప్రాణం. అందుకే అంత ఇబ్బందుల్లోనూ, నిండు చూలాలు అయినా కూడా సినిమా చూసింది అంటే అది కేవలం నాగేశ్వర్రావు మీద ఉన్న పిచ్చితోనే అని చెప్పారు చిరంజీవి.
అంటే నాకు నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే సినిమాలు అంటే అంత అభిమానం.. అందుకే నటుడినైనా.. ఆ మహానటుడితో కలిసి మెకానిక్ అల్లుడు సినిమాలో నటించాను అని చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన సందర్భంగా మెగాస్టార్ తన తల్లిదండ్రుల గురించి చెప్పారు. ఈ అవార్డులను 2018 ఏడాదికి గాను స్వర్గీయ లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవికి, 2019 ఏడాదికి గాను నటి రేఖకు అందజేశారు.