మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ ‘విజేత’ తో హీరోగా పరిచయం అయ్యాడు అయితే , ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింది. అయినాకానీ మెగాస్టార్ సపోర్ట్ తో ‘సూపర్ మచ్చి’
అనే సినిమాలో ఈజీగానే ఛాన్స్ కొట్టేసాడు. ఈ చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమా ఇప్పటికే 40% షూట్ కూడా పూర్తి చేసుకుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు. ఈ చిత్రం 2020 సమ్మర్ కి విడుదల కావలసి వుంది. ఇన్సైడ్ అప్డేట్ ప్రకారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది.
శ్రీ విష్ణు నటించిన ‘తిప్పరా మీసం’ సినిమా ను కూడా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలే తీశారు ఈ సినిమా హిట్ కొట్టివుంటే ఆలాభాలతో ‘సూపర్ మచ్చి’ షూటింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయి ఉండేది. అయితే ‘తిప్పరా మీసం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం ఇవ్వకపోవటం తో నిర్మాతలు ఫైనాన్సియల్ గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్లనే ‘సూపర్ మచ్చి’ షూటింగ్ ఆగిపోవాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు మెగా ఫామిలీ రంగంలోకి దిగి ‘సూపర్ మచ్చి’ షూటింగ్ కొనసాగించటానికి వేరే ప్రొడ్యూసర్స్ తో మంతనాలు సాగిస్తుందట. కల్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రియా చక్రవర్తి నటిస్తుంది.