ఆంధ్రప్రదేశ్‌ కాబినేట్‌ సమావేశ నిర్ణయాలివే..

రాజధాని అమరావతి రగడ నేపథ్యంలో ఏపీ కేబీనెట్‌ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశ నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి తొలుత సోమవారం ఉదయం ఏపీ కేబినెట్‌ సమావేశం సాగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను ఆమోదించారు. ముఖ్యంగా మూడురాజధానుల ఏర్పాటుపై నియమించిన హైపవర్‌ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్రంలో 11వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతిలో రాజధాని ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులకు సంబంధించి కౌలును 10 నుంచి 15 ఏళ్లకు పెంచారు. సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ, పరిపాలన వికేంద్రీకరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటుకు సూత్రప్రాయంగా పచ్చజెండా ఊపింది.

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ జరిగిందనే ఆరోపణపై లోకాయుక్త విచారణకు సైతం మంత్రి మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం విశేషం. ఇక అమరావతిలోన మూడు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తంగా శాసన రాజధానికి అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖ, జ్యూడిషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలును చేయాలని నిర్ణయించారు. విశాఖలో సచివాలయం ఏర్పాటు చేసి, హెచ్‌వోడీ కార్యాలయాలు కూడా అక్కడే ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. అదేవిధంగా పులివెందుల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటితో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు, నాలుగు ప్రాంతీయ కమిషనరేట్ల ఏర్పాట్లు సైతం మంత్రి మండలి కీలక నిర్ణయాలను తీసుకుంది. వీటిని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించనున్నారు.

Tags: ap cabinet meeting, capital amaravathi, cm jagan, vishakapatnam