ఇటీవలే ఓ సినిమా విడుదలైంది. పాజిటివ్ బజ్‌తో దూసుకెళ్తున్నది. ఆ వెంటనే మరో ప్రాజెక్టును సిద్ధమయ్యాడు హీరో. తన పుట్టినరోజు కానుకగా ఆ వివరాలను ప్రకటించాడు. ఆ అగ్రహీరో ఎవరనుకుంటున్నారా? మరెవరో కాదు. మాస్‌మహారాజా రవితేజ. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో రవితేజ నటించిన డిస్కోరాజా చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాన్యహోప్, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, బాబీసింహ, వెన్నెల కిషోర్ తదితరులు తారాగణం నటించగా, తమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పాజ్‌టీవ్ బజ్‌తో దూసుకుపోతున్నది. తక్కువ సంఖ్యలో థియేటర్లను కేటాయించిన ఆశించిన స్థాయి మించి వసూళ్లను రాబడుతున్నది. వరుస ప్లాపులో సతమతమవుతున్న రవితేజ స్టామినా తగ్గిపోలేదని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
ఇదిలా ఉండగా రవితేజ నటించే తరువాతి చిత్రంపై క్లారిటీ వచ్చేసింది. జనవరి 26 ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని సంబంధిత వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించింది. ఏ స్టూడియో పతాకంపై హవీష్ ప్రోడక్షన్స్ ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలను చేపట్టింది. ఇక ఈ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్‌లతో రాక్షసుడు సినిమాను తీసిన రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నట్ల చిత్ర బృందం ప్రకటించింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్న ఈ చిత్ర షూటింగ్‌ను ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభించి, మార్చ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ కొనసాగిస్తామని నిర్మాత కోనేరు సత్యనారాయణ వెల్లడించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.