సినీ పరిశ్రమ అంటే ప్రేమకథలకు పుట్టినిల్లు. ఎవరిని ఇష్టపడుతారో? ఎవరిని వదులుకుంటారో? ఎవరిని పెళ్లి చేసుకుంటారో? అంతా మిస్టరీగా ఉంటుంది. ఆ ప్రేమలు అన్నీ ట్విస్ట్ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక జంట కొత్తగా వెలుగులోకి వస్తుంటుంది. లేదంటే విడిపోతుంది. ఇక ఇలాంటి కథలు, రాసలీలు టాలివుడ్ కంటే బాలివుడ్‌లో మరీ ఎక్కువ. ఇప్పుడు తాజాగా అలాంటి విషయమే ఒకటి వైరల్‌గా మారింది. బాలివుడ్ వర్గాల్లో సంచలనాన్ని రేపుతున్నది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరును సంపాదించుకుంటున్న ఓ కుర్ర హీరో, ఓ బాలివుడ్ అగ్రహీరోయిన్ ప్రేమలో మునిగితేలుతున్నారని హిందీ సినీ పరిశ్రమ కోడై కూస్తున్నది. ఇంతకీ ఆ జంట ఎవరంటే కత్రీనాకైఫ్, యువ హీరో విక్కీ కౌషల్. ఇపుడు వీరి జోడి కాక రేపుతున్నది.
బాలివుడ్‌లో సంచలనం సృష్టించిన మసాన్ సినిమాతో వెలుగులోకి వచ్చాడు యువ హీరో విక్కీ కౌషల్. అటు తరువాత యురీ చిత్రంలో కీలకభూమికను పోషించడమేగాక ఏకంగా జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ఈ సంచలన హీరో తన ప్రేమలోనూ సంచలనాన్ని రేపుతున్నాడు. ఏకంగా బాలివుడ్ అగ్రహీరోయిన్ కత్రినాకైఫ్‌తో ప్రేమలో పడ్డాడని తెలుస్తున్నది. అదీగాక వీరిద్దరూ అర్ధరాత్రి వేళ రహస్యంగా తమ మిత్రుడి ఇంట్లో కలుసుకుంటున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అలా కలిసిన సందర్భాల్లో మీడియాకు కూడా చిక్కారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా లీకవుతుండడం సంచలనాన్ని రేపుతున్నది. ఆ చిత్రాలు సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయినప్పటికీ వారిద్దరూ ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. ఎవరికి వారుగా తమ సినిమాల్లో బిజీబిజీగా గడిపేస్తుండడం విశేషం.
ఇదిలా ఉండగా తెలుగులో మల్లీశ్వరీ సినిమాలో మెరిసిన కత్రినా అటు తరువాత వరుసగా బాలివుడ్‌లో బిజీ హిరోయిన్‌గా మారింది. షారూక్, సల్మాన్ తదితర బాలివుడ్ అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో విఫలమైంది. సల్మాన్, రణబీర్‌కపూర్‌లతో ప్రేమాయణం సాగించింది. అవి పెళ్లి వరకు వెళ్లి చివరినిమిషంలో రద్దయ్యాయి. తాజాగా ఆమె యువహీరో విక్కీ కౌషల్‌తో రోమాన్స్ సాగించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది కూడా మధ్యలోనే పోతుందా? లేక పెళ్లి చేరుతుందా? అని బాలివుడ్‌వర్గాలు చర్చించుకుంటున్నాయి.