నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రధాని మోదీ పలకరించడం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. విషయం మరింత పెద్దదిగా మారుతుండటంతో రఘురామకృష్ణంరాజు ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చి జగన్‌ను కలిసి వివరణ ఇచ్చారట. ప్రధానిమోదీతో తనకు గతం నుంచే సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారని తెలుస్తోంది.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే మోదీతో తనకు వ్యాపారవేత్తగా పరిచయం ఉందని చెప్పుకొచ్చారట. ఆ పరిచయంతోనే తనను గుర్తు పట్టిన ప్రధాని బాగున్నారా..! అంటూ విష్ చేశారని, కానీ మీడియాలో మరో రకంగా వార్తలు వచ్చాయని తెలిపారట. అలాగే తెలుగు భాష గురించి పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలపై రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ మోహన్ రెడ్డికి వివరణ ఇచ్చారట. తన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించరాని చెప్పుకున్నారని సమాచారం.
తెలుగు భాష ప్రాధాన్యం గురించి చెబితే నేనోదో రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంపై తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. తన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని, తన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని సమర్థించుకున్నారట. ఆగమేఘాల మీద జగన్‌తో అర్జంటుగా ఏర్పాటైన ఈ సమావేశంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు పాల్గొనడం గమనార్హం.
ఇక జగన్‌తో కృష్ణంరాజు భేటీపై రాజకీయ వర్గాల్లో.. సోషల్ మీడియాలో పలు రకాల అభిప్రాయాలు, విశ్లేషణలు..కామెంట్లు..సెటైర్లు పేలుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయి ‘రెడ్డి’ని పలకరిస్తే.. కలగని అనుమానం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణం’రాజు’ని పలకరిస్తే రావడం విడ్డూరంగా ఉందని నెటిజన్లలో రాజుగారికి సానుభూతి వ్యక్తమవుతోంది.
ఏమిటీ ఈ తేడా.? అంటూనే ‘రెడ్డి’అవడం వల్ల విజయసాయిరెడ్డిపై వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి విశ్వాసం ఉంది. అదే సమయంలో ‘రాజు’ అయిన రఘురామ కృష్ణంరాజు విషయంలో సీఎంకి అపనమ్మకం ఏర్పడిందని కొంతమంది నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఈ కులాల కోణం పార్టీకి అంత మంచింది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.