టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. షూటింగ్స్ ఖాళీ దొరికినప్పుడల్లా బాలిలో వెకేషన్స్ ఎంజాయ్ చేసే సమంత ఇప్పుడు కూడా అదే పనిలో ఉంది. బాలిలో అందాన్ని ఆస్వాదిస్తూ ఇండోనేషియాలో ఉన్న సమంత తన ఎక్స్పీరియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
ఈసారి సమంత రెండు ఫొటోలు షేర్ చేసింది ఈ రెండు ఫొటోలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు షేర్ చేస్తూ సమంత ఈరోజు బాలి రోడ్ ట్రిప్ లో ఒక సర్ప్రైజ్ ను చూశాను అంటూ టాగ్ చేసింది. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సమంత తన నవ్వుతోనే అందరిని కట్టిపడేస్తుంటుంది. అందంతోపాటు అభినయం అలాగే మంచి సేవ భావం కలిగిన సమంత ఏది ? చేసినా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది.
బాలి రోడ్ ట్రిప్‌లో సమంత అందానికి కోతలు కూడా ఫిదా అవుతున్నాయి. బాలిలో వెకేషన్ గడుపుతున్న సమంత కూలింగ్ గ్లాసెస్ ని ఒక్క కోతి కొట్టేసి పారిపోయిందట. బాలిలోని ఉలవాటు రోడ్ ట్రిప్ చేస్తున్న సమంతకి ఈ అనుభవం ఎదురు అయిందని స్వయంగా సమంత షేర్ చేసింది. ఈ కోతికి మంచి టేస్ట్ ఉంది నా కూలింగ్ గ్లాసెస్ కొట్టేసింది అంటూ ట్యాగ్ చేసింది.
సమంత షేర్ చేసిన మరో ఫోటోలు ఆ కోతి కొట్టేసిన సన్ గ్లాసెస్‌ని ఎలాగైనా సాధించాలని ఓ వ్యక్తి తెగ ట్రై చేస్తున్నాడు. ఇక 2022 మయోసైటీస్ ఉందని ప్రకటించిన సమంత తన పెండింగ్ ప్రాజెక్టు ఖుషి సినిమాతోపాటు, సిటాడెల్ వెబ్ సిరీస్ లను పూర్తి చేసింది. ఈ సినిమాలు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు సమంత వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.