ఓల్డ్ హీరోయిన్ రాధ గురించి.. చాలా తక్కువ మందికే కొన్ని విషయాలు తెలుసు. అనేక మంది హీరోలతో కలిసి నటించిన రాధ.. అగ్రతారగా వెలిగింది. ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు ఒక సందర్భంలో విజయవాడలోని క్షేత్రయ్య కళా క్షేత్రంలో ఆడిన నాటకంలో రాధను ఆయన గుర్తించారు. ఇలా.. చిన్న వయసులోనే రాధ సినీ రంగానికి పరిచయం అయింది. తర్వాత.. హీరో కృష్ణ సరసన అనేక సినిమాల్లో ఆమె నటించింది.
ఇదిలావుంటే.. సినిమా రంగంలోకి ఒక్క ఛాన్స్ అంటూ.. వచ్చిన రాధ మెగాస్టార్ చిరు సహా.. కుర్ర హీరోల సరసన నటించి.. ఎంతో పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు… అటు తమిళంలోనూ ఇటు.. తెలుగులోనూ.. మరోవైపు కన్నడ మూవీ రంగంలోనూ రాధ అనేక వందల సినిమాల్లో నటించింది. తర్వాత..వివాహం చేసు కుని.. సినిమాలకు దూరమయ్యారు. అయినా.. సినీ రంగంతో ఆమెకు సంబంధాలు ఉన్నాయి.
తెలుగు టీవీ సీరియల్స్ నిర్మాతగా, తమిళనాడులో రాధికతో కలిసి చేస్తున్న ప్రాజక్టులు ఇలా.. అనేక రూ పాల్లో రాధ తన హవాను కొనసాగిస్తున్నారు. ఇలా ఒక్క ఛాన్స్ అంటూ తెలుగు సినిమా ప్రపంచంలోకి అనేక మంది వచ్చినా.. రాధ మాదిరిగా ఎవరూ ఇంత రేంజ్‌లో అయితే… ఇటు సినిమాల్లోనూ.. అటు నిర్మాణ రం గంలోనూ తనదైన ముద్ర వేసిందనే చెప్పాలి.
ఈ రేంజ్‌లో నేటి తరం హీరోయిన్లు సాహసం చేయలేక పోతుండడం గమనార్హం. రాధ ఆ తర్వాత తన ఇద్దరు కుమార్తెలను హీరోయిన్లుగా పరిచయం చేసినా వారు మాత్రం సక్సెస్ కాలేదు. పెద్ద కుమార్తె కార్తీక రంగం లాంటి హిట్ సినిమాతో పాటు ఎన్టీఆర్‌కు జోడీగా దమ్ము సినిమా చేసింది. రెండో అమ్మాయి తులసి కడలి సినిమాతోనే చాప చుట్టేసింది.