దర్శక ధీరుడు రాజమౌళి ఒకప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు రాజమౌళి. ఆ తరువాత పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన మరో సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ దక్కించుకోవడంతో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నాడు రాజమౌళి. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ పిక్చర్ కేటగిరీలో ‘ క్రిటిక్స్ ఛాయిస్ ‘ అవార్డు కూడా దక్కింది.
ఇలా ఆర్ఆర్ఆర్ ఊహించని స్థాయిలో అవార్డులు దక్కించుకోవడంతో ఈ సినిమాలో నటించిన వారితో పాటు రాజమౌళికి కూడా పాన్ ఇండియా లెవెల్లో ఫాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో ఆ సినిమాపై భారి అంచనాలు నెలకొంటున్నాయి. రాజమౌళి ఇటీవల క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు అందుకుంటున్న సమయంలో స్టేజ్‌పై మాట్లాడుతూ..” మా అమ్మ పేరు రాజ నరేంద్రిని అని.. నాలోని టాలెంట్ గుర్తించి నేను సినిమాల్లోకి రావడానికి కారణం మా అమ్మే ” అంటూ చెప్పుకొచ్చాడు.
అలానే “మా వదిన శ్రీవల్లి నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటుందని ..వదిన అంటే అమ్మతో సమానమని.. మా వదినమ్మ కూడా నన్ను అమ్మలాగే చూసుకుంటూ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక నా భార్య రమా రాజమౌళి నా సినిమాల్లో ఫ్యాషన్ డిజైనర్ లో పనిచేస్తుందని అందరికీ తెలిసిందే. నిజ జీవితంలో కూడా నా లైఫ్ డిజైనర్ రామానే” అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వదినను అమ్మతో పోలుస్తూ ఆమె కూడా రాజమౌళి ఇండస్ట్రీకి రావడానికి ఒక కారణమని రాజమౌళి చెప్పడంతో రాజమౌళి వదిన శ్రీవల్లి చాలా గ్రేట్ అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజన్స్.