టాప్ యాంక‌ర్ సుమ‌ను ఆ బిహేవియ‌ర్‌తోనే టాలీవుడ్ లైట్ తీస్కొంటుందా…!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ అన‌గానే మనకు గుర్తుకు వచ్చేది సుమ. సుమ యాంకరింగ్ ఫీల్డ్ లోకి వచ్చి కొన్ని పదుల సంవత్సరాలు దాటుతున్నప్పటికీ అదే క్రేజ్ తో కొనసాగుతుంది. రియాల్టీ షోస్ కాకుండా.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ఏవైనా సరే మొదటిగా డైరెక్టర్స్ కి గుర్తుకు వచ్చేది సుమ పేరే. సుమ ఏదైనా షో చేసిందంటే 100% సక్సెస్ వస్తుంది అని నమ్మకం డైరెక్టర్స్ కి తెప్పించింది సుమ. అయితే పుట్టింది పెరిగింది అంత కేరళలో అయినప్పటికీ ఈ మలయాళీ కుట్టి తెలుగులో చక్కగా మాట్లాడుతుంది.

వాక్చాతుర్యంతో అందరిని కట్టిపడేసే సుమ స్టార్ హీరోల ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లలో, ఇంటర్వ్యూలో అలాగే బుల్లితెరపై జరిగే షోస్ తో సహా వరుస అవకాశాలతో యాంకరింగ్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. అయితే యాంకరింగ్ ఫీల్డ్ లో ఎంతోమంది వచ్చి ఫెడ్ అవుట్ అయిపోయినప్పటికీ ..సుమ మాత్రం నిన్న మొన్నటి వరకు అదే క్రేజ్ తో కొనసాగుతుంది. స్టార్ హీరోస్ కు హీరోయిన్స్ కి ఉన్నట్టే సుమకి కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Anchor Suma Kanakala HD Photos

ఇటీవల సుమ కొన్ని షోస్ లో మాత్రమే కనిపిస్తుంది. దీనికి మెయిన్ కారణం సుమ రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిందట. అంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో పాటు డైరెక్టర్ లు బ్రతిమాలాడినా సరే రెమ్యూనరేషన్ కాస్త కూడా తగ్గించకుండా బిహేవ్ చేయడంతో టాలీవుడ్ డైరెక్టర్స్ కాస్త ఆలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు విన్న చాలా మంది నెటిజన్స్ టాప్ యాంకర్ అయిన నువ్వు ఈ బిహేవియర్ తోనే ఉంటే టాలీవుడ్ లైట్ తీసుకుంటుంది సుమ అంటూ కామెంట్ చేస్తున్నారు . చూడాలి మరి ఇప్పటికైన సుమ తన బీహేవియర్ మార్చుకుంటుందో లేదో..?

Suma Kanakala Photos [HD]: Latest Images, Pictures, Stills of Suma Kanakala  - FilmiBeat