మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ గతేడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ సినిమా ద్వారా ఆల్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. తాజాగా రామ్‌చరణ్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ నటించిన సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే ఆ సినిమా డైరెక్టర్ తో ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడడానికి ఇష్టపడడట. గతంలో బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లఖియా, రామ్ చరణ్ కలిసి చేసిన జంజీర్ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా హీరోయిన్.
దీంతో రాంచరణ్ ఆ డైరెక్టర్ అపూర్వ లఖియాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదంటూ నేషనల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారంపై తాజాగా డైరెక్టర్ లఖియా స్పందించారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్‌లోనే పెద్ద అవుతుందని ఊహించి తీశానని కానీ అది ఫ్లాప్ అయ్యిందని వాపోయాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యాక చరణ్ నన్ను దూరం పెట్టాడంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు.
తాను ఇప్పటికి కూడా హైదరాబాద్ వస్తే చరణ్ దగ్గరికి వెళ్తానని.. త్రిబుల్ ఆర్ సినిమా చేసేటప్పుడు కూడా నాకు రాంచరణ్ కాల్ చేసి యాక్షన్ సీన్స్ గురించి డీటైల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని చెప్పాడు. అలాగే నేను కూడా చరణకు చాలా సార్లు ఫోన్ చేశాను.. కాకపోతే ఆయన ఫోన్ లిఫ్ట్ చేసే వారు కాదని… దానికి కారణం మా ఇద్దరి మధ్య గొడవలు లేవు… ఆయన సినిమాల్లో బిజీగా ఉండడంతోనే ఫోన్ లిఫ్ట్ చేయడం కుదరదని చెప్పాడు.
చరణ్ భార్య ఉపాసననే ఫోన్ లిఫ్ట్ చేసేదని… నేను ఫోన్ చేసినప్పుడు కూడా చరణ్ భార్య ఉపాసననే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడేవారని అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు అపూర్వ లఖియా. ఇక జంజీర్ సినిమా తెలుగులో తుఫాన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా ప్లాప్ అయ్యింది.