సమంత వేసుకున్న ఈ చెప్పుల ఖరీదు ఎంతో తెలుసా..? పాప బాగా రిచ్ అయిపోయిందిగా..!!

సెలబ్రెటీలు వాడే వస్తువుల గురించి సోషల్ మీడియాలలో బాగా చర్చ జరుగుతూ ఉంటుంది. సెలబ్రెటీలు బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు.. వాళ్లు ధరించిన దుస్తులతో పాటు చెప్పులు, వాచ్‌లు, క్యాప్‌లు.. ఇలా ప్రతీది చర్చనీయాంశంగా మారుతోంది. సెలబ్రెటీలు ధరించే వస్తువుల ధరల గురించి ఫ్యాన్స్ చర్చించుకుంటూ ఉంటారు. వాటి ధర ఎంత ఉంటుందనేది తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో చెక్ చేస్తూ ఉంటారు.

Family Man' star Samantha is trending after name change on Twitter & Insta.  This is what it reads now | Editorji

తాజాగా హీరోయిన్ సమంత చెప్పుల గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. సమంత ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. దీంతో కొంతమంది ఆమెను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలలో సమంత ధరించిన చెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఈ చెప్పుల ధర గురించి చాలామంది ఆరా తీయగా.. రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని తేలింది.

ఆ కారణంగానే సమంత అంత కాస్ట్లీ చెప్పులు వేసుకుంటుందా.. పాపం

దీంతో ఈ విషయం తెలుసుకుని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రూ.2 లక్షల విలువ చేసే చెప్పులను సమంత వాడుతుందా?అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చెప్పులు లూయిూస్ కంపెనీ తయారుచేసినవిగా తెలిసింది. ఇటీవల సిటాడెట్ వెబ్ సిరీస్‌లో షూటింగ్ కోసం సమంత లండన్ వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ఈ చెప్పులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే సమంత ఈ చెప్పులను ధరించడానికి ఒక కారణం ఉందట. ఆమె మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది.

Samantha will act in this webseries check out details

ఈ వ్యాధి వల్ల అరికాళ్లు అలా సున్నితంగా ఉంటాయట. అందుకే సమంత ఖరీదైన ఈ చెప్పులను వాడుతుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం సమంత ఖుషీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల టర్కీలో జరిగింది. ఇందుకోసం టర్కీ వెళుతున్న సమయంలో సమంత ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది.