వ‌రుణ్ – లావ‌ణ్య ఎంగేజ్మెంట్‌కు ప‌వ‌న్ భార్య రాలేదెందుకు ? ఆ అనుమానం నిజ‌మేనా ?

మెగా వారసుడు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ కార్యక్రమం కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సభ్యులు హైలెట్ అయ్యారు. చిరంజీవి – సురేఖ సమక్షంలో వరుణ్ లావణ్యకు ఎంగేజ్మెంట్ తొడిగాడు. ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. అల్లు అరవింద్ దంపతులు, రామ్ చరణ్ – ఉపాసన, బన్నీ – స్నేహ దంపతులు, చిరు అన్నదమ్ములు తోబుట్టువులు, మేనకోడళ్ళు, మేనల్లుళ్లు మొత్తం అందరూ వచ్చారు.

అయితే ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజ్నోవా మాత్రం కనిపించలేదు. దీంతో రకరకాల సందేహాలు మొదలయ్యాయి. ఇటు బావగారి కొడుకు ఎంగేజ్మెంట్ జరుగుతుంటే చిన్నమ్మ ఎక్కడికి ?వెళ్లారంటూ మీడియాలో ప్రచారం మొదలైంది. అన్నా లెజ్నోవా ఏ కారణంతో ? ఈ వేడుకకు హాజరు కాలేదు అసలు ఆమె ఎక్కడ ? ఉంది అంటూ మెగా అభిమానులు, పవన్ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కొంతకాలంగా సింగపూర్ లో ఉంటూ తన పిల్లలను చదివిస్తోందన్న పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఆమె తరచూ సింగపూర్, దుబాయ్ లో కనిపిస్తున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. ఇటీవల ఆమె మెగా ఫంక్షన్లలో ఎక్కడా కనిపించలేదు. ఆమె ఎక్కడ ? ఉన్నా మెగా ఫ్యామిలీ ఫంక్షన్ల‌కు కచ్చితంగా రావలసిన అవసరం ఉంది. ఇప్పటికే పవన్ అన్నా లెజ్నోవా దూరంగా ఉంటున్నారన్న పుకార్లు అయితే బయలుదేరాయి.

Facts about Anna Lezhneva: who is she and everything about her!

ఇప్పుడు ఆమె ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు కూడా రాకపోవడంతో ఈ సందేహాలు మరింతగా వైరల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఇదే ఎంగేజ్మెంట్ వేడుకకు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య కూడా రాలేదు. అంతకుముందు చైతన్య తిరుపతి ఫ్యామిలీ టూర్ లో నిహారిక కూడా కనిపించలేదు. ఇక గత కొద్దిరోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా అటు పవన్ భార్య అన్నా లేజ్నోవా ఇటు నిహారిక, భర్త చైతన్య ఇద్దరు ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు రాకపోవడంతో పెద్ద గందరగోళం నెల‌కొంది.