నారా లోకేష్.. ఒకప్పుడు వైసీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యువనాయకుడు. ఒకప్పుడు అవహేళనకు కూడా గురైన నాయకుడు. అయితే.. నవ్విన నాపచేను పండినట్టుగా.. తనను తాను మలు చుకోవడంలోనూ.. రాజకీయంగా దూకుడు పెంచడంలోనూ లోకేష్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యా యి. “ముందు ఆయనను తెలుగు సరిగా మాట్లాడడం నేర్చుకోమనండి!“ అంటూ.. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఎగతాళి చేసిన సందర్భాలు ఇప్పటికీ.. వినిపిస్తూనే ఉన్నాయి.
“ఆయనో పప్పు.. ఆయన గురించి మాట్లాడేదేంటి. మంగళగిరిలో గెలిచి చూపించమనండి!“ అని మాజీ మంత్రి కొడాలి నాని అన్న మాటలు కూడా.. ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. ఆ సమయంలో ఎదురు దాడి చేసినా.. నారా లోకేష్ మాత్రం తర్వాత కాలంలో చేతులు దులుపుకొని కూర్చోలేదు. కఠిన పరీక్షలను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన రాటు దేలారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న పాదయాత్ర యువగళం పరిశీలిస్తే.. ఆసాంతం మార్పు చెందిన లోకేష్ కనిపిస్తు న్నారని.. టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఎక్కడా తొణుకు లేదు.. ఎక్కడా బెణుకు లేదు. చేస్తున్న విమర్శల్లో పస ఉంటోంది. చెబుతున్న మాటల్లో పట్టు ఉంటోంది. ఒకప్పుడు.. నమ్మకం లేదని దూరంగా ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి వంటి నాయకులు ఎదురేగి.. మరీ నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకునే పరిస్థితికి వచ్చింది.
అంతేకాదు.. నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించినా.. ప్రజలకు హామీలను గుప్పించినా.. నారా లోకేష్ ఇస్తున్న హామీలపై నమ్మకం ఏర్పడేలా చేస్తున్నారు. అదేస మయంలో యువతను ప్రధానంగా ఆకర్షిస్తు న్నారు. వచ్చే ఎన్నికల్లో యువ ఓటర్లు పెరుగుతారనే సంకల్పం ఉన్న నేపథ్యంలో.. వారిని ఆకర్షించడం ద్వారా నారా లోకేష్ తన దైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఎల చూసుకున్నా.. నారా లోకేష్ గ్రాఫ్ పుంజుకుందనే చెబుతున్నారు పరిశీలకులు.