ఆ హాట్ హీరోయిన్‌తో జూనియ‌ర్ ఎన్టీఆర్ పెళ్లి చెడ‌గొట్టింది ఎవ‌రు… తెర‌వెన‌క ఏం జ‌రిగింది..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి హీరోల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్ వేసిన బీజంతో ఆయన వారసులు ఎందరో చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. వారిలో కొందరు మాత్రమే స్టార్ హీరోలగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉన్నారు. వీరిలో టాలీవుడ్‌లోనే స్టార్ హీరోలుగా కొనసాగుతున్న బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాల నటుడిగానే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు. నిన్ను చూడాలని ఉంది సినిమాతో సోలో హీరోగా మారాడు.. ఆ తర్వాత వరుస హిట్ల‌తో టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవ‌ల్లో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్టీఆర్ నటించిన అశోక్ – నరసింహుడు సినిమాలు ప్లాపులుగా మిగిలాయి.

ఈ సినిమాల్లో ఎన్టీఆర్‌కు జంటగా నటించిన హీరోయిన్ సమీరా రెడ్డి మాత్రం ఎన్టీఆర్ పాలిట ఐరెన్‌లెగ్‌గా మారింది. ఈ సినిమాల త‌ర్వాత ఎన్టీఆర్- సమీరా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. స‌మీరా బాలీవుడ్ బ్యూటీ అయినా ఆమె తెలుగుమ్మాయే. ఆమెది ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అయితంపూడి. ఎన్టీఆర్‌కు భార్య‌గా వెళ్లాల‌ని స‌మీరా ఎన్నో ఆశ‌ల‌తో ఉండేద‌ట‌.

అయితే వీరి ప్రేమ‌ విష‌యం తెలుసుకున్న నంద‌మూరి కుటుంబం, చంద్ర‌బాబు నాయుడు ఆఘ‌మేఘాల మీద ల‌క్ష్మీప్ర‌ణ‌తి చిన్న వ‌య‌స్సులో ఉండ‌గానే ఆమెతో ఎన్టీఆర్ పెళ్లి ఫిక్స్ చేసేశార‌ట‌. ఆ త‌ర్వాత సమీరారెడ్డి తెలుగులో సినిమాలు మానేసి కోలీవుడ్- బాలీవుడ్ లో సినిమాలు చేశారు. సినిమా అవకాశాలు తగ్గిపోయాక అక్ష‌య్ వ‌ర్థ‌న్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. అస‌లు స‌మీరా ఇప్పుడు గుర్తు ప‌ట్ట‌లేని ఆకారంలోకి మారిపోయింది.