బాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ వర్మతో డేటింగ్ రూమర్స్‌తో తమన్నా ఒక్కసారిగా సోషల్ మీడియాలో హట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ వార్తలు నిజమేనని, ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్ అని మిల్కీ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది . విజయ్ వర్మతో లవ్‌లో ఉన్నానని చెప్పకనే చేసింది తమన్నా. బాలీవుడ్ హీరో విజయ్ వర్మ, తమన్నా కలిసి నటించిన ‘ లాస్ట్ స్టోరీస్ 2 ‘ . ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఇదే విషయాన్ని స్వయంగా తమన్న చెప్పుకొచ్చింది. వీరిద్దరూ కలిసి తొలిసారిగా నటిస్తున్న ఈ తొలి ప్రాజెక్టు లోనే వారి ప్రేమకు బేజం పడింది.
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. నాకు పార్టనర్ అయినందుకు నేను విజయ్‌వర్మను ఇష్టపడలేదు.. నేనే చాలామంది నటులతో కలిసి నటించాను కానీ. విజయ్ వర్మ మాత్రం వాళ్ళ అందరికంటే నాకు చాలా స్పెషల్.. నాకు ఏమైనా జరిగితే నాకు అతడు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉందంటూ తన లవర్ విజయ్‌వర్మ గురించి తెగ పొగిడేసింది. దీంతో ప్రస్తుతం విజయ్ వర్మ పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ విజయ్ వర్మ ఎవరు అంటూ నెట్టింట వెతకడం మొదలుపెట్టారు. విజయ్ బాలీవుడ్ హీరోగానే అందరికి తెలుసు.. కానీ అతను కూడా మన తెలుగు వాడే అన్న విషయం చాల మందికి తెలియదు. విజయ్ వర్మ హైదరాబాద్‌కి చెందిన వారేనట. ఇక విజయ్ భాగ్యనగరంలోనే పుట్టి పెరిగి.. ఇక్కడే థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత పూణేలోని ‘ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’లో యాక్టింగ్ కోర్స్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు.
అలా 2008లో ‘షోర్’ అనే షార్ట్ ఫిలిం ద్వారా యాక్టింగ్‌లో అడుగుపెట్టి.. 2012లో ‘చిట్టగాంగ్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.. 2016లో ‘పింక్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గల్లీబాయ్, ‘సూపర్ 30’, ‘బాఘీ 3’, ‘డార్లింగ్స్’ సినిమాలతో పాపులర్ అయ్యాడు.. నేచురల్ స్టార్ నాని ‘ఎమ్‌సీఏ’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. విలన్‌గా ఆకట్టుకున్నాడు.. తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు.
ఆ తర్వాత హిందీలోనే బిజీ అయిపోయాడు.. విజయ్‌వర్మ – తమన్నా ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా నటించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి జంటగా నటిస్తున్న తాజా మూవీ లాస్ట్ స్టోరీస్ 2. ఇక ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకులు ముందుకు రానుంది. రియల్ లైఫ్ లో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట వెండితెరపై ఎలా ? రెచ్చిపోయారో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.