చాలామంది హీరోయిన్లు ఈ మధ్యకాలంలో సైలెంట్ గా పెళ్లి అంటూ షాకిస్తున్నారు. ఇక మరి కొంతమంది హీరోయిన్లు నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఒంటరిగా ఉంటున్నారు. ఇక మరి కోంత మంది ఎవరికి తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. ఇక అలా పెళ్లి చేసుకున్నా వారిలో స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది స్టార్ హీరోయిన్లు రహస్యంగా పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఊహించని షాక్ ఇచ్చారు. ఇలా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దం
శ్రీదేవి: ఇక అతిలోక సుందరి శ్రీదేవి సైతం ముందుగా బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందని ప్రచారం జరిగింది. వీరిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం కూడా చేశారని అంటారు. ఆ తర్వాత బోనీకపూర్ శ్రీదేవి జీవితంలోకి ఎంటర్ కావడంతో అతి కొద్ది మంది సమక్షంలో బోనీని పెళ్లాడారు. విచిత్రమేంటంటే బోనికపూర్ కు కూడా అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నారు.
సావిత్రి: మహానటి గా పేరు తెచ్చుకున్న సావిత్రి అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ సూపర్ స్టార్ జెమినీ గణేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విచిత్రమేంటంటే ఈ విషయం నాలుగు సంవత్సరాల వరకు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పాటు విడిపోయారు. జెమిని గణేష్ సావిత్రి ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు.
ప్రణీత: అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ప్రణీత కూడా సీక్రెట్ గానే తన పెళ్లి చేసుకుంది. ప్రణీత లాక్ డౌన్ సమయంలో తన ప్రియుడు నితిన్ రాజును వివాహం చేసుకుంది. పెళ్లి ఫోటోలు బయటకు వచ్చే వరకు విరికి పెళ్లి అయ్యింది అనే ఈ విషయం ఎవరికీ తెలియలేదు.
శ్రియ: టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హట్ బ్యుటి శ్రియ కూడా రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా వివాహం చేసుకుంది. ముంబైలో అతికొద్ది సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వత కూడా శ్రియ తన కెరీర్ ను కొనసాగిస్తోంది.
రమ్యకృష్ణ:టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా తన పెళ్లిని ఎంతో రహస్యంగా చేసుకుంది. ఇక ఈమె టాలీవుడ్ విలక్షల దర్శకుడు కృష్ణ వంశితో ప్రేమలో పడ్డ ఈమె ఎంతో రహస్యంగా 2003లో ఏడడుగులు వేసింది. ఇలా వీరే కాకుండా ఎందరో హీరోయిన్లు ఇలా రహస్యంగా పెళ్లి చేసుకుని ఒకటియ్యరు.