ఈ రోజులలో టీ, కాఫీ, తాగడం, గుట్కా, పాన్ నమలడం ఎక్కువైపోయింది. దీంతో పళ్ళు పసుపు రంగులోకి మారటం, ప్రతిరోజు బ్రష్ చేసిన కూడా పళ్లపై ఆ గార అలాగే ఉంటోంది. చాలా మంది సెలబ్రిటీలు గారపట్టిన పళ్లతో బయటకు వెళితే వారి పరువు కూడా పోతూ ఉంటుంది. అయితే పళ్లపై ఉన్న పసుపు గారను చిన్న ట్రిక్స్‌తో పోగొట్టేయొచ్చు.
దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో పల్లకి పట్టిన పసుపు రంగు తొలగించుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక ప్యాకెట్ ఈనో (Eno) పొడి వేసుకున్న తర్వాత దానిలో సగం నిమ్మబద్ధ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మీ చేతి వేళ్ళతో పసుపు రంగుగా మారిన పళ్ళు దగ్గర బాగా రుద్దాలి.
ఇలా రెండు నిమిషాల పాటు చేసిన తర్వాత నోటిని శుభ్రంగా కడగాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేసినట్లయితే పల్లకి ఉన్న పసుపు రంగు పోతుంది. Eno నోటిలోని బ్యాక్టీరియాను తొలగించడంతో పాటు దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుంది. పళ్ళ సమస్యలు ఉన్నా కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో విటమిన్స్ ఉండడం వల్ల పళ్లు అన్ని గట్టి పడతాయి.
ఇంకా నిమ్మబద్ద కూడా ఎటువంటి బ్యాక్టీరియాల్ని చేరకుండా చూసుకుంటుంది. నిమ్మకాయ, eno ఎవరికి అయినా అందుబాటులో ఉంటాయి. ఈ చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం కూడా కనిపిస్తుంది.