కన్నడ సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు స్టైలిష్ హీరో యశ్. అక్కడ ఎన్నో సినిమాలు చేసినా రాని క్రేజ్ కేజీఎఫ్ సినిమాతో వచ్చేసింది. కేజీఎఫ్ సీరిస్ సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో ఘన విజయం సాధించాయి. దీంతో అతడి ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.
ఇదిలా ఉండగా, యశ్ తన కో స్టార్ రాధిక పండిట్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే యశ్ ముందుగా తన కెరీర్‌ను బుల్లితెరపై మొదలుపెట్టాడు. కన్నడ బుల్లితెరపై ప్రసారమయ్యే గోకులనంద సీరియల్‌తో బుల్లితెరపై ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్లో తన నటనతో భారీ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు.
అదే సీరియల్లో తనతో నటించే తన ఫ్యూచర్ వైఫ్ రాధిక పండిట్‌ను కలిశాడు యాశ్. వీరిద్దరి బుల్లితెర రొమాన్స్ అప్పట్లో ఓ సెన్షేషనల్. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో నటించి వరుస విజయాలు అందుకున్నారు. అలా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో కొన్నాళ్లపాటు డేటింగ్ కూడా చేశారు.
ఈ జంట 2016లో బ్రహ్మీస్ – గౌడ ( వక్కలిగ) సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం రాధిక సినిమాలకు దూరంగా ఉంటూ తన ఫ్యామిలీ లైఫ్‌లో ఎంతో హ్యాపీగా ఉంది. రాధిక ఇప్పటకీ.. ఈ వయస్సులోనూ స్టార్ హీరోయిన్లను మించిన అందం మెయింటైన్ చేస్తూ ఉంటుంది.