మహానటి సావిత్రి.. చేయని రోల్ లేదు. ప్రేమికురాలు నుంచి.. వేశ్య పాత్రల వరకు.. పౌరాణికాల నుంచి జానపదాల వరకు దుమ్ము దులిపేసి.. వెండి తెరపై వీర విహారం చేసింది. అనేక సినిమాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకున్న సావిత్రి..దాదాపు అందరి సరసనా నటించింది. దీనికి కారణం.. ఆమె ఫేసే నని అంటారు. ఇదే విషయాన్ని అప్పటి అగ్ర నటుడు.. తొలితరం హీరో.. చిత్తూరు వి. నాగయ్య కూడా చెప్పేవారు.
సావిత్రి బహు ముఖవర్ఛస్సు ఉన్న అమ్మాయి. చాలా ఫ్యూచర్ ఉంది. జానకి గురించి చెప్పడం సరికాదు అని అనేవారట. అయితే.. అదేస మయంలో సావిత్రికన్నాముందు ఇండస్ట్రీకి వచ్చిన జానకి కూడా మంచి ఫాంలోనే ఉంది. అయితే.. నాగయ్య వ్యాఖ్యలు.. పరిశ్రమలో జోరుగా వ్యాపించాయి. దీంతో సావిత్రికి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ ఉక్రోషం ఆపుకోలేక.. జానకి.. నాగయ్యపై విరుచుకుపడింది. నాన్నగారు.. నాన్నగారు… అని పిలిచినందుకు బాగానే అన్నారు అని వ్యాఖ్యానించింది.
ఇదేసమయంలో నోరు జారింది. ఆయనకు కూడా బిడ్డలు ఉండిఉంటే ఇలానే అనేవారా? అని జానకి అనేసింది. ఇది వివాదం కాలేదు. కానీ, నాగయ్య మనస్తాపానికి గురయ్యారు. దీనిపై అన్నగారు ఎన్టీ ఆర్ జోక్యం చేసుకుని.. నాగయ్యకు సారీచెప్పించారు. తర్వాత. వివాదం సర్దు మణిగినా.. జానకి గ్రాఫ్ మాత్రం పెరగలేదు. దీంతో కొన్ని రోజులు కర్ణాటకకు వెళ్లిపోయారు. తర్వాత ఎప్పుడో మళ్లీ తాయారమ్మ.. బంగారయ్య మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారని అంటారు.