ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ యాక్టరస్ గా ఒక వెలుగు వెలిగింది షకీలా. శృంగార పాత్రలలో నటించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. షకీలా సినిమా విడుదలవుతుందంటే చాలు కేవలం షకీలా కోసమే సినిమాలకు వెళ్లేవారు జనం. అప్పట్లో షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు స్టార్ హీరోస్ కూడా తమ సినిమాలను పోస్ట్ ఫోన్ చేసుకున్న సందర్భాలు కామన్. షకీలా తెలుగులోనే కాక తమిళ భాషలోను చాలా సినిమాలో నటించింది.
ఒకప్పుడు స్టార్ యాక్ట్రెస్ గా వరుస సినిమాలతో బిజీగా గడిపిన షకీలా గత కొంతకాలంగా ఎటువంటి సినిమా ఛాన్సులు లేక ఖాళీగా ఉంటుంది. అప్పుడప్పుడు బుల్లితెరపై మెరుస్తు కొన్ని రియాల్టీ షోలో కనిపిస్తోంది. అయితే ఒకప్పుడు బిజీ షెడ్యూల్ గడిపిన షకీలా కోట్లలో ఆస్తులను కూడా పెట్టిందని ఇప్పుడు సినిమా అవకాశాలు లేకపోయినా బీఎండబ్ల్యూ కారులో లగ్జరీగా తిరుగుతుందని ఆస్తిని ఫుల్గా ఎంజాయ్ చేస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.
కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా ఆ వార్తలు నిజం కాదని.. ఉండడానికి సొంత ఇల్లే లేక ఇబ్బంది పడుతున్న నేను బీఎండబ్ల్యూలో తిరుగుతూ లగ్జరీ లైఫ్ ఎలా గడుపుతాను..? ఒకప్పుడు సినిమాలో ఒకరోజు నటించడానికి నాలుగు లక్షల రెమ్యూనిరేషన్ తీసుకున్న మాట వాస్తవం.. అప్పట్లో కోట్ల ఆస్తులు కూడా పెట్టిన విషయం నిజమేనని చెప్పుకొచ్చింది.
కానీ ఆస్తి అంతా నా పేరు మీదే ఉంటే ఇన్కమ్ టాక్స్ వారితో ఇబ్బందిగా ఉంటుందని.. మా అక్క చెప్పిన మాయ మాటలు విని నా ఆస్తి మొత్తం ఆమె పేరు రాశానని.. ఆమె ఆస్తిని మొత్తం తన సొంతం చేసుకొని నన్ను మోసం చేసిందని.. ఇలా నేను సొంత వారి చేతిలోనే అన్యాయంగా మోసపోయానని తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది షకీలా.
20 ఏళ్ల క్రితమే షకీలా రోజుకు రు. 4 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునేదన్న వార్తలు రావడంతో ఇప్పుడు ఇండస్ట్రీ జనాలు, షకీలా దీనస్థితి చూసిన వారంతా నోరెళ్ల బెడుతున్నారు.