టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. కొత్తబంగారు లోకం సినిమాతో యూత్‌లో వరుణ్‌కు ఒక్కసారిగా తిరుగులేని పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత కొన్ని హిట్లు పడినా వరుణ్ వరుస ప్లాప్‌లు ఎదుర్కోవడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఒకానొక టైంలో వరుణ్‌కు ఏకంగా 13 ప్లాపులు పడ్డాయి.
ఇక వరుణ్ సందేశ్ భార్య వితికాశెరు.. తక్కువ సినిమాల్లో నటించినా కొన్ని టీవీ షోలలో యాంకర్‌గా వ్యవహరించి పాపులారిటీ సంపాదించుకుంది. వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తోన్న టైంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు. బిగ్ బాస్ షో ద్వారా వరుణ్ సందేశ్ – వితిక షేరు జోడి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ షో వల్ల వితికాపై నెగెటివిటీ ప్రేక్షకుల్లో పెరిగిందని వితికా కొన్ని సందర్భాల్లో ఫీల్ అయింది.
బిగ్ బాస్ షో వితికకు మైనస్ అయిందని నెటిజన్లు కూడా కామెంట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ వితిక సంపాదన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనిషిని మార్చకూడదని.. బయట ప్రపంచంలో సైతం సక్సెస్, ఫెయిల్యూర్ అనేది సాధారణంగానే ఉంటాయని వరుసగా ఫ్లాపులు రావడంతో నేను సినిమాలకు బ్రేక్ఇ చ్చానని.. దేవుడు స్క్రిఫ్ట్ ని ఎవరు మార్చలేరు అని వరుణ్ చెప్పుకొచ్చాడు.
బిగ్‌బాస్ షో తర్వాత వితికా గురించి నెగటివ్ కామెంట్లు ఎక్కువగా వచ్చాయని.. ఓ రియాల్టి షో ను చూసి మనిషిని జడ్జ్ చేయడం అసలు ఎంత వరకు కరెక్ట్ ? అంటూ ప్రశ్నించాడు. వితికా యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయిందని.. ఆమె విషయంలో గర్వపడుతున్నానని వరుణ్ సందేశ్ వివరించాడు. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె నెలకు కొన్ని లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తుందంటూ వరుణ్ సందేశ్ చెప్పకనే చెప్పేశాడు.