పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌తో కలిసి నటించిన బ్రో మూవీ ఈ నెల 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా వీరిద్దరి కలయికలో రాబోతున్న ఫస్ట్ సినిమా కావడం విశేషం. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ మూవీ వినోదయ సీతమ్‌కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా కి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ వినోదయ సీతమ్ విమర్శకులనుంచి ప్రశంసల్ని అందుకుంది. ఈ సినిమాకి కూడా సముద్రఖని డైరెక్షన్ వహించాడు. ఇక తమిళ్ వర్షన్‌తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశారు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో భాగం కావడంతో బ్రో మూవీ పై అంచనాలను మరింత పెరిగాయి. ఈ సినిమా బడ్జెట్ తో పాటు థియేట్రికల్ బిజినెస్‌లు ఓటీటీ ధరలు టాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. బ్రో మూవీ దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌కి దాదాపు రూ.45 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వినోదయ సీతమ్, బ్రో సినిమా కథల మధ్యన చేసిన మార్పులు ఏంటో చూద్దాం. వినోదయ సీతమ్‌లో టైమ్ పాత్రలో సముద్రఖని నటించగా బ్రో సినిమాలో టైమ్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషించాడు. తమిళ్లో స్టోరీ నడిపించే కీరోల్ కమెడియన్ తంబి రామయ్య ప్లే చేశాడు. తెలుగులో సాయి ధరమ్ తేజ ఆ రోల్ ప్లే చేశాడు.
వినోదయ సీతమ్ పెళ్లికి వచ్చిన ముగ్గురు పిల్లలు.. తండ్రి కథ చుట్టూ సాగుతుంది. బ్రో సినిమా మాత్రం పెళ్ళి కానీ యువకుడు క్యారెక్టర్ లో బ్యాక్ డ్రాప్‌తో వస్తుంది. వినోదయ సీతమ్ పాటలు లేవు.. కేవలం ఒకే ఒక్క మాంటేజ్ బీట్ సాంగ్ ఉంటుంది. బ్రో సినిమాలో మాత్రం మూడు పాటలు ఉన్నాయి. ఈ పాటలకి తమన్ సంగీతాన్ని అందించాడు. తమిళ్ సినిమాకి ఏ లవ్ ట్రాక్ లేదు. బ్రో సినిమాలో సాయిధరమ్ తేజ్ లవ్ ట్రాక్ నడుపుతాడు. ఇద్దరు హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారు. వినోదయ సీతమ్‌లో సింగిల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా లేదు. బ్రో లో మాత్రం పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్తేజ్లపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నట్లు సమాచారం.
ఇక వినోదయ సీతం 99 నిమిషాలు మాత్రమే రన్ టైం ఉంటుంది. బ్రో కు 135 నిమిషాల వరకు రన్ టైం ఉన్నట్లు తెలుస్తుంది. వినోదయ సీతంతో పోలిస్తే బ్రో సినిమా టైం పాత్ర అంటే పవన్ కళ్యాణ్ రోల్ పొడిగించినట్టు సమాచారం. తమిళ్లో ఈ సినిమాకి కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సముద్రఖని చేయగా.. తెలుగులో సముద్రఖని కేవలం దర్శకత్వం మాత్రమే వహించాడు. స్క్రీన్ ప్లే , మాటలు త్రివిక్రమ్ చేకూర్చాడు. వినోదయ సీతమ్ మూవీ రూ.10 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టింది. బ్రో మూవీ థియేటర్ల్ బిజినెస్ రూ.100 కోట్ల వరకు చేసే అవకాశం ఉందట.