ప్రముఖ హీరో ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన అన్న బాటలోనే అమెరికాలో కొంతకాలం జాబ్ చేసి సినిమాల పైన ఆసక్తితో జాబు వదిలేసి ఇండియాకు వచ్చేశారు. ఇక అలా దొరసాని సినిమాతో అన్న ఇన్ఫ్లుయెన్స్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ సత్తా చాటే ప్రయత్నం చేశాడు. కానీ ఈ సినిమాతో పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాడు.
ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ , పుష్పక విమానం వంటి చిత్రాలతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు ఆనంద్ దేవరకొండ. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే అలరించడానికి సిద్ధమవుతున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆనంద్ సరసన వైష్ణవి చైతన్య అనే యూట్యూబర్ హీరోయిన్గా నటిస్తోంది.
జూలై 14 వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమా కోసం చిత్ర బృందం ముందుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న సర్కార్ సీజన్ 3 ఎపిసోడ్ కి గెస్ట్ లుగా వచ్చిన విషయం తెలిసిందే. వైష్ణవి చైతన్య , ఆనంద్ దేవరకొండ, విరాజ్ , సీత నలుగురు కలిసి షో కి హాజరయ్యారు.
బెట్టింగ్ ఆటగా సాగే ఈ కార్యక్రమంలో ఒకవైపు నవ్వులు పూయిస్తూనే మరొకవైపు టెన్షన్ పెట్టే ప్రశ్నలతో ప్రేక్షకులను అలరించారు ప్రదీప్. ఇక అందులో భాగంగానే.. గరుడ ఎయిర్లైన్స్ ఏ దేశానికి చెందినది అని ప్రదీప్ ప్రశ్న అడగ్గా.. ఆ ప్రశ్నకు విరాజ్ సమాధానాన్ని చెప్పలేక పోతారు ఆ తర్వాత వెస్టిండీస్ అని చెప్పగానే మధ్యలో ఆనంద్ దేవరకొండ కల్పించుకొని నేను కూడా గరుడ లో వెస్టిండీస్ కి వెళ్ళాను అక్కడ పెద్ద గరుడ స్టాచు కూడా ఉంటుంది అని కామెంట్లు చేశారు.
అయితే పర్సనల్గా ఎవరితో వెళ్లారు ? అమ్మాయితో వెళ్ళారా ? అయితే ఆ అమ్మాయి విషయాలు మాకు చెప్పొచ్చు కదా .. అని ప్రదీప్ అడగ్గా.. ఆనంద్ దేవరకొండ సిగ్గుపడుతూ అవన్నీ చెప్పడం కుదరదు అంటూ మాట దాటేసారు. ఇక ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇక ఆనంద్ దేవరకొండ ఎవరితోనో ప్రేమలో పడ్డాడు అంటూ పలువురు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్న విజయ్ కూడా సీక్రెట్‌గా ప్రేమాయణాలు నడుపుతున్నాడని అంటున్నారు.. ఇప్పుడు తమ్ముడు కూడా అలాంటి పనులే మొదలు పెట్టాశాడా ? అన్న గుసగుసలు ఇండస్ట్రీలో నడుస్తున్నాయి.