ర‌కుల్‌ప్రీత్‌సింగ్ పెళ్లిపై వేణుస్వామి సంచ‌ల‌నం.. మ‌రో స‌మంతేనా..!

టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి దాదాపు అందరికి తెలిసిందే. ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్రపరిశ్ర‌మ‌లో ఉండే సెలబ్రిటీల జీవితంలో ఏమేమి జరుగుతాయో ముందుగా చెబుతూ బాగా పాపులర్ అయిన వేణు స్వామి. ఇప్పటికే నాగచైతన్య – సమంత పెళ్లి పెళ్లి సమయంలో వీరు ఎక్కువ కాలం కలిసి ఉండరు.. త్వరలోనే విడాకులు తీసుకుంటార‌ని కూడా చెప్పారు. అలాగే రీసెంట్ గా విడాకులు తీసుకుని విడిపోయిన మెగా డాటర్ నిహారిక గురించి కూడా వేణుస్వామి చెప్పిందే నిజమైంది.

అలాగే టాలీవుడ్ లో ఓ హీరో మరణిస్తాడని చెప్పిన కొద్ది రోజులకే తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. ఇలా వేణుస్వామి చెప్పినవన్నీసెలబ్రిటీల విషయంలో వాస్తవం అవ్వడంతో ఆయనను నమ్మే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి స్టార్ హీరోయిన్లు క్యూకడుతున్నారు. రీసెంట్ గానే స్టార్ హీరోయిన్‌ పూజాహెగ్డే కూడా వేణుస్వామితో పూజలు చేపించుకొని హాట్ టాపిక్ గా మారింది.

ఈ సమయంలో వేణుస్వామి మ‌రో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గురించి ఎవరు ఊహించని కామెంట్లు చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న వెంటనే ఆమె కెరీర్ డౌన్ ఫాల్ అయిపోతుందని అప్పట్లోనే హెచ్చరించాడు. ఇప్పుడు రకుల్ పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. ఇక ఆమెకు ఎలాంటి అవకాశాలు లేవని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కూడా వేణుస్వామి మరోసారి చెప్పుకొచ్చాడు.

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకున్న ఆమె అతి తక్కువ సమయంలోనే మళ్ళీ విడిపోవడం గ్యారంటీ అంటూ మరో షాకింగ్ వార్త చెప్పుకొచ్చారు. ఇప్పటికే గతంలో వేణుస్వామి చెప్పిన విషయాలని నిజమవడంతో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ జీవితంలో కూడా ఆయన చెప్పిందే నిజమవుతుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో రకుల్ ప్రీత్ సింగ్ జీవితంలో ఏం జరుగుతుందో చూడాలి.