అక్కినేని హీరోల సినిమాల ప్లాప్‌కు ఆ వంశంలో ఉన్న ఆ దోష‌మే కార‌ణ‌మా.. వేణుస్వామి చెప్పిన నిజం..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒకప్పుడు యంగ్ హీరోలకు ధీటుగా సినిమాల్లో నటిస్తూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. గ‌త కొన్నేళ్ల‌లో నాగ్ వ‌రుస డిజాస్ట‌ర్లు ఎదుర్కొంటున్నాడు. బంగార్రాజు మిన‌హా నాగ్‌కు స‌రైన హిట్ లేదు. గ‌తేడాది ” ది ఘోస్ట్ ” సినిమాతో డిజాస్టర్ కొట్టాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఏ సినిమాలో నటించకపోవడంతో నాగార్జున ఇకపై సినిమాల్లో నటిస్తాడా ? లేదా ? అనే అనుమానం అభిమానుల్లో మొదలైంది.

ఇక నాగచైతన్య విషయానికి వస్తే బంగార్రాజు సినిమాతో హిట్ సాధించాడు అనుకునే లోపు వరుసగా లాల్ సింగ్ చద్దా, కస్టడీ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇంకా అఖిల్ సినీ కెరీర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి గందరగోళంగా సాగుతుంది. ఐదు సినిమాల్లో అఖిల్ నటించినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్పించి మిగతావన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ఇటీవలే వచ్చిన ” ఏజెంట్ ” సినిమా డబుల్ డిజాస్టర్ అయ్యింది.

ఇప్పటికే చాలామంది సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాల‌కు చెప్ప‌డం… అవి నిజమవడంతో పాపులర్ అయిన వేణు స్వామి.. అక్కినేని కుటుంబం ఇలా వరుస ఫ్లాప్ లను ఎదురవడానికి గల కారణాన్ని కూడా వివరించాడు. అక్కినేని కుటుంబానికి ” వంశ దోషం ” ఉందని.. అందుకే వీరి కుటుంబంలో విడాకులు జరుగుతున్నాయని.. అలాగే వీరు సినిమాల్లో కూడా వరుస అపజయాలని ఎదుర్కోవడానికి కూడా ఆ వంశ దోషమే కారణమని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.