చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలకు కొన్ని పాత్రలు వాళ్ళ కోసమే పుట్టాయా అన్నట్టుగా అనిపిస్తాయి. ఆ పాత్రల్లో కేవలం వాళ్ళు తప్ప మరెవరు నటించలేరన్నంతగా ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోతారు. అలాంటి హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఆయన హీరోగా నటించిన తొలిప్రేమ, తమ్ముడు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో స్టోరీని పవన్ కళ్యాణ్ తన నటనతో డామినేట్ చేస్తాడు.
ఆ పాత్రలలో పవన్ కళ్యాణ్ తప్ప మరే హీరో చేయలేడనేలా జీవించేస్తాడు. ఈ టైంలో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వల్ల విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాగా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు వాసు. పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా స్టోరీ పరంగా.. పాటల పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సినిమా ఇప్పటికీ .. ఈ తరంలో కూడా నచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంత మంచి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యిందంటే ఎవరూ నమ్మలేరు.. కానీ ఇది నిజం. అందుకు కారణం గతం లో పవన్ కళ్యాణ్ ఇదే తరహా సినిమాల్లో ఇదే రకమైన పాత్రలు పోషించి, జనాల్లో నాటుకుపోయాడు. వాసుకు వెళ్లిన ప్రేక్షకులు కూడా తొలిప్రేమ రేంజ్‌లో ఊహించుకుని థియేటర్లలోకి వెళ్లాడు.
ఈ సినిమాని చూస్తున్నంతసేపు వెంకటేష్ ని ఎవ్వరూ చూడలేదు, ఆయన స్థానం లో పవన్ కళ్యాణ్ ని ఊహించారు. అందుకే కమర్షియల్ గా ఈ చిత్రం వర్కౌట్ కాలేదని అంటుంటారు విశ్లేషకులు. తొలిప్రేమ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కరుణాకరన్‌కి ఈ చిత్రం రూపం లో ఫ్లాప్ ఎదురైంది.