టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్ని సంవత్సరాల వెంకటేష్ కెరీర్లు ఎక్కువగా విజయాలు ఉంటాయి. కుటుంబ కథా చిత్రాలు, మహిళలను మెప్పించే సినిమాలలో వెంకటేష్ ఎక్కువగా నటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తన వయసుకు తగినట్టుగా ప్రయోగాత్మక పాత్రలలో నటిస్తూ మంచి విజయాలు సొంతం చేసుకుంటున్నారు.
వెంకటేష్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో ఎన్నో ? సినిమాల్లో నటించారు. సిమ్రాన్, సౌందర్య, మీనా లాంటి హీరోయిన్లను తన సినిమాలలో రిపీట్ చేసి హిట్లు కొట్టిన సందర్భాలు అనేకం. అయితే ఫైర్ బ్రాండ్ హీరోయిన్ రోజాకు వెంకటేష్ కు గత రెండున్నర దశాబ్దాలుగా మాటలు లేవు అన్నది వాస్తవం. దీని వెనక పెద్ద కథే నడిచింది. అంతకుముందు వెంకటేష్ – రోజా కాంబినేషన్లో పోకిరి రాజా లాంటి సినిమాలు వచ్చాయి.
తమిళంలో హిట్ అయిన ఒక సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగులోనూ తమిళంలో హీరోయిన్గా నటించిన రోజానే తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అయితే అప్పటికే వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్లో వరుసగా సూపర్ హిట్ లు వస్తున్నాయి. దీంతో వెంకటేష్ సౌందర్యను తీసుకుంటే బాగుంటుందన్న సలహా నిర్మాతలకు ఇచ్చారట. వెంటనే వాళ్ళు రోజా ప్లేస్ లో సౌందర్యను హీరోయిన్గా తీసుకున్నారు.
తర్వాత ఆ విషయం రోజాకు తెలియడంతో వెంకటేష్ కావాలనే తనను సినిమా నుంచి తప్పించారని అపోహ పడిందని అంటారు. నాటి నుంచి నేటి వరకు వెంకటేష్ – రోజా కాంబినేషన్లో మరో సినిమా రిపీట్ కాలేదు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మాటలు లేవని కూడా ఇండస్ట్రీ జనాలు గుసగుసలాడుకుంటారు. తర్వాత రోజా రాజకీయాల్లోకి వెళ్లి రెండుసార్లు ఎమ్మెల్యేకి గెలిచి.. ఇప్పుడు మంత్రిగా ఉన్నా కూడా వెంకటేష్ కు రోజాకు ఏ మాత్రం సఖ్యతలేదని చెబుతూ ఉంటారు.