వెంకటేష్- ఐశ్వర్యరాయ్ కాంబోలో రావాల్సిన సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..!

మాజీ విశ్వసుందరి స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ఇంతవరకు తన కెరీర్లో 40కుపైగా సినిమాల్లో నటించింది.. బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ లోనే ఐశ్వర్యరాయ్ ఎక్కువ సినిమాలు చేసింది. ఈమె టాలీవుడ్ లో మాత్రం ఒక్కటంటే ఒక సినిమా కూడా చేయలేదు. గతంలో ఐశ్వర్యరాయ్ ను తెలుగులో ఎంట్రీ చేయాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు అవి మధ్యలోనే ఆగిపోయాయి

వెంకటేష్ సరసన ఐశ్వర్యారాయ్.. జయంత్ దర్శకత్వంలో.. కానీ.., Aishwarya rai is  suppoed act with venkatesh for jayanth film here are the details– News18  Telugu

ఇదే సమయంలో గతంలో విక్టరీ వెంకటేష్ సినిమాతో ఐశ్వర్యారాయ్ ను టాలీవుడ్ కి పరిచయం చేయాలని అనుకున్నారు.. అయితే ఇది కూడా జరగలేదు.. వెంకటేష్ ఐశ్వర్య కాంబోలో ఎవరు ఊహించని ఓ సూపర్ హిట్ సినిమా మిస్సయింది. ఇంతకీ ఆ మూవీ ఏమిటంటే.. ప్రేమించుకుందాం రా. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాను వెంకటేష్ అన్న సురేష్ బాబు సొంతంగా నిర్మించారు.

Venkatesh celebrates 25 years of Preminchukundam Raa with film's team:  Watch video | Telugu Movie News - Times of India

ఇక ఈ సినిమాలో అంజలా జవేరి హీరోయిన్గా నటించింది.. టాలీవుడ్ లో ఈమెకు ఇదే మొదటి సినిమా. శ్రీహరి, జయప్రకాశ్ రెడ్డి, రంగనాథ్, అన్నపూర్ణ వంటి అగ్ర నటలు ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా 1997లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.. మ్యూజికల్ గాను ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇదే సమయంలో ఈ సినిమాలో మొదట ఐశ్వర్యరాయ్ ను హీరోయిన్‌గా అనుకున్నారు. అదే సమయంలో ఈ సినిమా దర్శకుడు జయంత్ కు తన బంధువుల ద్వారా ఐశ్వర్యరాయ్ తో కొంత పరిచయం ఏర్పడింది.

Venkatesh: Aishwarya Rai who was supposed to be paired with Venky.. Do you  know how the chance was missed.. – Telugu News | Did you know that Aishwarya  Rai was first considered

ఆ పరిచయంతోనే ఐశ్వర్యరాయ్ ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుందని భావించారు. కానీ అదే సమయంలో ఐశ్వర్యరాయ్ తన కెరీర్ లో రెండు భారీ ప్లాప్‌లను తన ఖాతాలో వేసుకుంది. ఇక దాంతో మూడో ప్లాఫ్ వస్తుందేమో అన్న భయంతో నిర్మాత సురేష్ బాబు ఐశ్వర్యరాయ్ ను హీరోయిన్ గా వద్దని చెప్పారట. ఇక అప్పుడు ఫైనల్ గా అంజలా జవేరి ని వెంకీకి జంటగా ఈ సినిమాలో ఎంపిక చేశారు. ఇక సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ పై ఎంతో అద్భుతంగా పండింది. ఈ సినిమా అప్పట్లో బాగా ఆకట్టుకుని భారీ వ‌సూళ్లను సాధించింది. ఈ విధంగా వెంకటేష్- ఐశ్వర్య కాంబోలో ఓ సూపర్ హిట్ సినిమా మిస్సయింది.