ఆ స్టార్ డైరెక్ట‌ర్ మ‌న‌వ‌రాలు సీనియ‌ర్‌ ఎన్టీఆర్ ల‌వ‌ర్‌… పేద్ద స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

చెట్టు పేరు చెప్పి కాయ‌ల‌మ్ముకునే ప‌రిస్థితి సినిమా ఇండ‌స్ట్రీలో లేద‌నేది అంద‌రికీ తెలిసిందే. టాలెంటే ఇక్క‌డ డామినేట్ చేస్తుంది. ఎవ‌రు ఎంత‌టి కుటుంబాల నుంచి వ‌చ్చినా.. చివ‌ర‌కు టాలెంట్ ఉంటేనే నిలుస్తున్నారు. గెలుస్తున్నారు. ఇక‌, బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనూ .. అనేక మంది కుటుంబాల నుంచి వ‌చ్చి సినీ రంగంలో ప‌నిచేశారు. ఇలాంటి వారిలో అగ్ర‌తార‌గా వెలుగొందిన దేవిక ఒక‌రు.

ఈమె వాస్త‌వానికి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు వేదాంతం రాఘ‌వ‌య్య గారి కుమార్తె కూతురు. అంటే.. వ‌రుస సొంత మ‌న‌వ‌రాలు. కానీ, ఎక్క‌డా ఎవ‌రికీ తెలియ‌దు. అలానే ప‌నిచేశారు. చివ‌ర‌కు రాఘవయ్య తో ప‌నిచేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు కూడా అమ్మాయి.. అని పిలిచేవారు త‌ప్ప ఇండ‌స్ట్రీలో ఎక్క‌డా బంధు త్వం క‌లిపేవారు కాదు. చివ‌ర‌కు నిర్మాత‌ల‌కు కూడా తెలియ‌దంటే ఎంత గోప్యంగానో వ్య‌వ‌హ‌రించేవారు.

దేవిక‌.. తొలినాళ్ల‌లోనే హీరోయిన్‌గా పాత్ర‌లు అందుకున్నారు. త‌మిళంలో తొలి అవ‌కాశం వ‌చ్చింది. ఇది సూప‌ర్ హిట్ కావ‌డంతో తెలుగులోనూ న‌టించారు. ఇంకా చెప్పాలంటే సీనియ‌ర్ ఎన్టీఆర్ దేవిక‌ను బాగా ప్ర‌మోట్ చేశారు. త‌న సినిమాల్లో చాలా ఛాన్సులు ఇచ్చారు. ఎన్టీఆర్ తొలి ప్రియురాలు దేవిక అన్న రూమ‌ర్ కూడా అప్ప‌ట్లో ఉండేది. దేవిక అప్ప‌ట్లో సావిత్రి వంటి అగ్ర‌తార‌ల‌తో పోటీ ప‌డాల్సి వ‌చ్చింది. దీంతో ఒక‌ప్పుడు పెద్ద‌గా ఆఫ‌ర్లు వ‌చ్చే వి కావు.

కెరీర్ ప్రారంభ స‌మ‌యంలో ఒక‌రిద్ద‌రు.. అత్యంత స‌న్నిహితులు ఆఫ‌ర్ల కోసం.. అయినా తాత‌గారి పేరు వాడుకోవ‌చ్చుగా అని సూచించినా.. దేవిక ఇష్ట‌ప‌డ‌లేదు. చాలా గోప్యంగానే ఉంచారు. ఇదే విష‌యాన్ని అన్న‌గారు రామారావు ఒక సంద‌ర్భంలో దేవిక‌ను మెచ్చుకున్నారు. ఎంతో మంది చెట్టు పేరు చెప్పుకొని బ‌తికేస్తున్నా.. దేవిక మాత్రం న‌ట జీవితంలో ఏనాడూ తాత పేరు చెప్పి.. ఒక్క ఆఫ‌ర్ కూడా తెచ్చుకోలేద‌ని ఆయ‌న ప్ర‌శంసించ‌డం విశేషం.