లావణ్య – వరుణ పెళ్లి డేట్.. ప్లేస్‌లో ఈ ట్విస్ట్ చూశారా…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి ఎప్పుడూ ఏదో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. గత కొంతకాలం క్రితం వరుణ్ తేజ్ – లావణ్య ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ వార్త‌ల‌కు తెర‌దించుతూ జూన్ 9వ తేదీన నాగబాబు ఇంటి వద్ద లావణ్య – వరుణ్ గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకుని ఉత్కంఠ‌కు తెర‌దించారు.

నిశ్చితార్థం తర్వాత కాబోయే భర్తతో ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది లావణ్య త్రిపాఠి. వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వ‌రుణ్‌ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి తెగ వైరల్‌గా మారాయి. రీసెంట్గా వరుణ్ – లావణ్య ఇటలీలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోస్‌లు కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి గురించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఒక్కటయే క్షణం వచ్చేసింది.. వీరి పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది అంటూ.. ఓ ముహూర్తంలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ ముహూర్తం ఎప్పుడో కాదు ఆగస్టు 24వ తేదీనట. యూర‌ప్‌లోని మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రం ఒట్టున‌ ఇట‌లీలో వీళ్ళు గ్రాండ్గా వీరు వివాహం చేసుకోబోతున్నారట. ఈ పెళ్లి పనులను దగ్గర ఉండి చూసుకోవడానికి వీరిద్దరూ కలిసి ఇటలీ కి వెళ్లారని స్వయంగా పెళ్లి పనులు చూసుకుంటున్నారని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.

ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు హాజరు కావడం లేదట. కేవలం మెగా, అల్లు ఫ్యామిలి మాత్రమే పెళ్ళికి అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌లో రిసెప్షన్ గ్రాండ్గా అరేంజ్ చేయబోతున్నారని దానికి మాత్రం సినీ ప్రముఖులందరూ హాజరవుతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో లావ‌ణ్య – వరుణ్ తేజ్‌పెళ్లి న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.