సోషల్ మీడియాలో గత కొద్ది రోజుల నుంచి వస్తోన్న రూమర్లకు ఎట్టకేలకు తెరపడింది. వరుణ్‌తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జరిగింది. వీరిద్దరు ఈ యేడాదిలోనే మూడు ముళ్ల బంధంతో దాంపత్య జీవితంలోకి ఎంటర్ కానున్నారు. దీంతో ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వరుణ్ – లావణ్య గురించి పలు ఇంట్రస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. అసలు వీరిద్దరి ప్రేమ ఫస్ట్ టైం ఎక్కడ ? చిగురించింది ? వీరు ఎలా ప్రేమలో పడ్డారన్న విషయాలు బయటకు వస్తున్నాయి.
మిస్టర్ సినిమా టైంలో వీరిద్దరు కలిసి ఫస్ట్ టైం నటించారు. ఆ టైంలో బల్గేరియాలో కొన్ని సీన్లు షూట్ చేశారు. అక్కడే ఫస్ట్ టైం వీరు ప్రేమలో పడ్డారట. ఆ తర్వాత మరోసారి వీరు అంతరిక్షం సినిమాలోనూ కలిసి నటించారు. దీంతో వీరి ప్రేమ బంధం మరింత స్ట్రాంగ్ అయ్యింది. ఈ క్రమంలోనే మిస్టర్ సినిమా ప్రమోషన్లలో వరుణ్ గురించి లావణ్య చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్ చాలా హైట్ ఉంటారు. ఆయనతో ఏదైనా సీన్ చేసేటప్పుడు నేను కింద ఓ బాక్స్ వేసుకుని దానిమీదకు ఎక్కి నటించాల్సి వచ్చేదని లావణ్య చెప్పింది. లావణ్య చెప్పింది నిజం కూడా..! నిజంగానే వరుణ్ అంత ఎత్తు ఉంటాడు. అయితే ఇప్పుడు కొందరు నెటిజన్లు వరుణ్‌తేజ్‌ను ముద్దు పెట్టుకునే టప్పుడు లావణ్య పాపం ఎంత కష్టపడి ఉంటుందో ? కదా ? అని కామెంట్లు చేస్తున్నారు.