పెళ్లి ముందే విడాకుల కండిషన్లు పెట్టుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఇదేంట్రా బాబోయ్‌..!

సినిమా సెలబ్రిటీలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం, కొంతకాలానికి సింపుల్‌గా విడిపోవడం సర్వసాధారణమైపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సెలబ్రిటీ జంటలు సింపుల్‌గా విడాకులు తీసేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్, మంచు మనోజ్ – ప్రణతి రెడ్డి, సుమంత్ – కీర్తి రెడ్డి, నాగచైతన్య – సమంత ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామందే డివోర్స్ తీసుకుని షాక్ ఇచ్చారు.

Varun Tej And Lavanya Tripathi's Engagement: Chiranjeevi's Nephew Set To  Get Married By End Of 2023

ఇక మెగా ఫ్యామిలీలో కూడా విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. చిరంజీవి కూతురు శ్రీజ గతంలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఆపై అతని నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నాగబాబు కూతురు నిహారిక కూడా డివోర్స్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మతో వరుణ్ తేజ్‌ నిశ్చితార్థం జరిగిపోయింది.

Varun Tej Lavanya Tripathi Share Romantic Photos From Their Engagement  Ceremony Samantha Prabhu Reacts Photos

అయితే మొన్నటిదాకా వీరు తమ రిలేషన్‌షిప్‌ను చాలా సీక్రెట్‌గా ఉంచారు. ఆపై ఎంగేజ్‌మెంట్ చేసుకొని సర్‌ప్రైజ్ చేశారు. అయితే దానికంటే ముందే సినీ వర్గాల్లో వీరిద్దరి మధ్య అఫైర్ నడుస్తూ ఉండని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి. కాగా ఎంగేజ్‌మెంట్ తర్వాత వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి గురించి రకరకాల వార్తలు సినీ పరిశ్రమలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే వరుణ్ తేజ్, లావణ్యలు పెళ్లికి ముందే పెటాకులు గురించి కొన్ని కండిషన్లు పెట్టుకున్నారంట.

Lavanya Tripathi: వరుణ్ తేజ్‌తో సహజీవనం.. క్లారిటీ ఇచ్చిన అందాల రాక్షసి -  NTV Telugu

నిజానికి వరుణ్ తేజ్, లావణ్యల తల్లిదండ్రులు ఈ కండిషన్లను పెట్టుకోవాల్సిన అవసరం ఉందని వీరిద్దరిపై ఒత్తిడి తెచ్చారంట. సినిమా సెలబ్రిటీలలో డివోర్స్ తీసుకోవడం కామన్ అయిపోయింది కాబట్టి వరుణ్ తేజ్, లావణ్యలు కూడా భవిష్యత్తులో విడాకులు తీసుకోవచ్చని ఇరువురి తల్లిదండ్రులు ఆలోచించారట. తర్వాత ఒక కండిషన్ పెట్టడం జరిగిందని సమాచారం. అదేమిటంటే లావణ్య, వరుణ్‌లు ఒకవేళ విడిపోతే ఒకరి ఆస్తులపై మరొకరికి ఎలాంటి హక్కు ఉండకూడదని వీరు కండిషన్ పెట్టారట.

Varun Tej to tie the knot with rumoured GF Lavanya Tripathi this year? Dad  Naga Babu reacts | Entertainment News, Times Now

అంటే డివోర్స్ తీసుకున్నాక వరుణ్ తేజ్‌ లావణ్య ఆస్తిపై ఎలాంటి హక్కు కలిగి ఉండడు. అలాగే లావణ్య కూడా వరుణ్ తేజ ఆస్తి నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. అయితే ఈ ప్రచారం గురించి తెలుసుకున్న మెగా అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. శుభమా అని పెళ్లి అవుతుంటే విడాకులు గురించి ఎవరైనా ఆలోచిస్తారా, బుద్దున్నోడు ఎవడైనా ఇలాంటి కండిషన్లను ముందుగానే పెట్టుకుంటాడా? అని వారు ఫైర్ అవుతున్నారు. అయితే సినీ సర్కిల్లో మాత్రం ఈ ప్రచారం జోరుగానే జరుగుతోంది. మరి దీనిలో నిజమెంత అనేది ప్రచారం చేస్తున్న వారికే తెలియాలి.