బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో కామెడీ షోస్ వచ్చినా జబర్దస్త్ ప్రోగ్రాం మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూస్‌గా రన్ అవుతూనే ఉంది. అత్యధిక టిఆర్పీలు దక్కించుకుంటూ మంచి స్వింగ్‌లో ఉన్న ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ షో ఇంత సక్సెస్ సాధించడానికి జబర్దస్త్ లో ఉండే కంటెస్టెంట్సే ప్రధాన కారణం. మరి ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించి ఎంతో మంది స్టార్లు గా ఎదిగారు.
ఇలా జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో వర్ష ఒకరు. ఇమ్మాన్యుయేల్‌తో కలిసి కొన్ని స్కిట్స్ లో నటించిన వర్ష సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ప్రజెంట్ బిజీగా గడుపుతూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక తాజాగా వర్ష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ లో జరిగే కొన్ని విషయాల గురించి ఓపెన్ అయింది.
కొన్ని కొన్ని సార్లు జబర్దస్త్ షోలో కంటెస్టెంట్ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ.. కన్నీరు పెట్టి తమ బాధలను వివరిస్తూ ఉంటారు. చాలామంది అదంతా ఫేక్ అని.. డబ్బులు ఇచ్చి అలా ఏడిపిస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. వీటిపై వర్షం స్పందించింది. అవన్నీ ఫేక్ కాదు నిజంగానే అంటూ చెప్పుకొచ్చింది వర్ష.
డబ్బులు ఇస్తే కన్నీళ్లు రావు.. కొన్ని కొన్ని సార్లు ఎదుటి కంటిస్టెంట్స్ లైఫ్ లో జరిగిన సంఘటనలు విన్నప్పుడు మనకు కూడా బాధ అనిపిస్తుంది.. నిజంగా కన్నీళ్లు వస్తాయని తెలిపింది. అంతేకాని గ్లిజరిన్ వల్ల వచ్చే కన్నీరు కాదు.. మాకు బాధలుంటాయి.. మేము డబ్బు కోసమే తెరపై నటిస్తున్నాం. మా బాధలను కూడా కొంచెం అర్థం చేసుకోండి.. కించపరిచేలా ఫేక్ కన్నీళ్లు అంటూ కామెంట్స్ చేయకండి అంటూ రిక్వెస్ట్ చేసింది వర్ష.