యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో ఎవరు ఊహించని భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో కొరటాల సినిమాపై అంచనాలు పెంచేశాడు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది.
అంతేకాకుండా ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాను ఎంతో కసిగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదే సమయంలో కొరటాల శివ ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. అందుకే ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ఈ సంక్రాంతికి వచ్చిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో ఆయనకు చెల్లెలుగా నటించి రఫ్పాడించింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో కూడా లేడీ విలన్ పాత్రలో కనిపిస్తుందట. దీంతో మరోసారి ఎన్టీఆర్ దేవర సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.
అలాగే సోషల్ మీడియాలో ఎన్టీఆర్- వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో పోటా పోటీగా తలపడుతూ ఉంటే అభిమానులకు పూనకాలు రావాల్సిందే అంటూ కామెంట్లు కూడా మొదలయ్యాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.