వియ్యంకులు అవ్వాల్సిన వాణిశ్రీ-ఎన్టీఆర్ ల నిర్ణయాని..సర్వ నాశనం చేసింది వాళ్ళేనా..?

మ‌హాన‌టి అనే పేరు రాలేదు కానీ.. అంతే స్థాయిలో సినీ జీవితంలో ఎన్నో గౌర‌వాలు పొందిన ఓల్డ్ హీరోయిన్ వాణిశ్రీ. ఎన్టీఆర్‌, అక్కినేని నుంచి శోబ‌న్‌బాబు, కృష్ణల‌తో ఆమె అనేక సినిమాల్లో ఆడిపాడారు. ఎంతో పేరు కూడా తెచ్చుకున్నారు. ముఖ్యంగా శోభ‌న్‌బాబు-వాణిశ్రీ జంట‌కు కుటుంబ క‌థా సినిమాల ద్వారా మంచి పేరు కూడా వ‌చ్చింది. అదేవిధంగా సీనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న కూడా ఆమె అనేక సినిమాలు చేశారు.

LEGEND senior NTR Daughters & Sons Family Photos | Family photos, New  images hd, Family

 

 

ఇదిలావుంటే.. సినిమా రంగంలో ఉన్న వారు ప్రేమించుకోవ‌డం.. కుటుంబాలు క‌లుపుకోవ‌డం తెలిసిందే. అక్కినేని కుటుంబంతో ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి రామానాయుడు వియ్యం అందుకున్నారు. అలానే.. చాలా మంది నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కూడా త‌మ త‌మ పిల్ల‌ల‌కు వివాహాలు చేశారు. అయితే.. ఈ క్ర‌మంలోనే వాణిశ్రీ కూడా.. ఎన్టీఆర్‌తో వియ్యం అందాల‌ని భావించారా? అంటే.. ఔన‌నే అంటున్నారు అప్ప‌టి సినీ ప్ర‌ముఖులు

NTR's Daughter Uma Maheswari Passes Away!

వాణిశ్రీకి ఒక్క కుమారుడు ఉన్నారు. అప్ప‌ట్లోనే ఐఐటీ చ‌దివారు. ఆయ‌న‌ను ఎన్టీఆర్ చివ‌రి కుమార్తెకు ఇవ్వాల‌ని త‌ద్వారా వియ్యం క‌లుపుకోవాల‌ని వాణిశ్రీ ఆలోచ‌న చేశారు. అయితే.. ఈ విష‌యం చెప్పే ధైర్యం లేదు. అంత పెద్ద న‌టుడి కుటుంబంతో వియ్య‌మే! అంటూ.. ఈ విష‌యం తెలిసిన వారు వాణిశ్రీని హెచ్చ‌రించారు. అయినా.. వాణిశ్రీప‌ట్టుబ‌ట్టి మ‌రీ.. అన్న‌గారి కుటుంబంతో వియ్యానికి ప్ర‌య‌త్నించారు. అప్పటికి ఎన్టీఆర్ మంచి ఫాంలో ఉన్నారు.

Prem Nagar actress Vanisri's son Abhinaya Venkatesha Karthik dies of cardiac arrest - Times of India

దీంతో ఆయ‌న‌ను క‌లిసి వాణిశ్రీ విష‌యాన్ని వెల్ల‌డించారు. కానీ, ఎన్టీఆర్ కుమార్తె వాణిశ్రీ కంటే కూడా 5 సంవ‌త్స‌రాలు పెద్ద‌ది కావ‌డంతో వాణిశ్రీ వెన‌క్కి త‌గ్గార‌ట‌.లేక‌పోతే.. ఎన్టీఆర్ కుటుంబంతో వియ్యం అందేవార‌ని అంటారు.