టాలీవుడ్ లెక్కల మాస్టర్ క్రేజీ దర్శకుడు సుకుమార్.. అల్లు అర్జున్‌కు పుష్ప లాంటి బంపర్ హిట్ ఇచ్చి ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే సుకుమార్- అల్లుఅర్జున్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారింది. సుకుమార్ – అల్లు అర్జున్ విషయంలో తప్పు చేస్తున్నాడు అంటే అవునని అంటున్నారు సినీ విశేషకులు. దానికి అసలు కారణం ఏమిటంటే సుకుమార్ తొలిసారిగా పుష్ప 2 విషయంలో మాత్రం రాంగ్ స్టెప్పులు వేస్తున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ చివరి దశకు రాగా.. గతంలోనే ఈ పుష్ప 2 టీజర్ వచ్చి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు సుకుమార్. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించనుంది ఈ సినిమా యూనిట్. అయితే పుష్ప 1 లో ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావ పాటతో పాన్ ఇండియా నే షేక్ చేసిన సమంత ప్లేసులో పుష్ప 2 సినిమాలో మరో హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.
పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం నిన్న మొన్నటి వరకు తమన్నా, పూజ హెగ్డే, పేర్లు వినిపించినా ఇప్పుడు సడన్గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా వచ్చింది. సుకుమార్ ఇప్పటికే దీనిపై ఊర్వశి రౌతేలాతో ఈ సాంగ్‌లో నటించేందుకు ఆమె డేట్లు కూడా తీసుకుని ఒప్పించాడట. అంతేకాకుండా ఆమె ఈ పాట కోసం ఏకంగా మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అడిగినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఊర్వశి చిరు వాల్తేరు వవీరయ్యలో బాస్ పార్టీ సాంగ్‌తో ఎంత ఫేమస్ అయిందో మనం చూశాం. ఇలాంటి సమయంలో సుకుమార్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతూ ఊర్వశికి కమిట్ అయ్యాడట. అయితే ఇక్కడ మరో చిక్కు వచ్చి పడింది బన్నీ ఫిజిక్‌కు ఊర్వశి రౌతేలా ఫిగర్ ఏమి సెట్ అవ్వదని చూడడానికి వీరిద్దరూ అక్క, తమ్ముళ్లలా ఉంటారని బన్నీ అభిమానులు మండిపడుతున్నారు.
దీంతో సుకుమార్ ఈ సినిమాలో ఈ బ్యూటీ ని మార్చకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ చేస్తున్నారు. ఇక మరి బన్నీ అభిమానుల కోరికను సుకుమార్ పట్టించుకుంటాడో లేదో చూడాలి.