మెగా కోడలు ఉపాసన.. రాంచరణ్ భార్యగా మనకి తెలిసింది చాలా తక్కువ. ఆమె గురించి చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్ అధినేతగా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తుంది ఉపాసన. ఈ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎంతో కష్టతరమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ తన ప్రతిభ చాటుకుంటుంది. ఉపాసనకు వృత్తిపరంగా బరువు బాధ్యతలు ఎంతగానో ఉన్నాయి.
అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ గా, అపోలో యు ఆర్ లైఫ్‌కి వైస్ చైర్‌పర్సన్‌గా, అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా, ఫ్యామిలీ హెల్ఫ్‌లైన్ ఇన్సూరెన్స్ టీపీఎల్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలిగా ఇలా ఎన్నో రకాల బాధ్యతలను నెరవేరుస్తోంది ఉపాసన. హెల్త్ – ఫిట్నెస్ సమాచారాన్ని అందించే వెల్నెస్ హెల్త్ కేర్ వెబ్‌సైట్ కూడా బి పాజిటివ్ పేరుతో రన్ చేస్తుంది ఉపాసన. జంతు ప్రేమికురాలిగా.. అపోలో హాస్పిటల్స్ కుటుంబానికి చెందిన ఒక మంచి వ్యక్తి ఉపాసన.
ఉపాసన ఎంతోమందికి ఉపాధిని కల్పించేందుకు యుఆర్ లైఫ్ ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ద బెస్ట్ అండ్ హెల్తీ పద్ధతులను అనుసరించే ఇంటిలిజెంట్. రీప్లేస్మెంట్ మెడిసిన్, ట్రీట్మెంట్‌తో జ్ఞానాన్ని అన్వేషించడం ద్వారా గ్రేట్ టాలెంటెడ్ ఉమెన్ అన్న పేరు కూడా ఆమె సొంతం. అపోలో యు ఆర్ ఎల్ లైఫ్ తో అత్యధిక సంఖ్యలో ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్స్ కలిగి ఉన్న ఉపాసన ఎన్నో ప్రశంసలను అందుకుంది.
కరోనా టైంలో అపోలో హెల్త్ మ్యాగజైన్‌ని నిలిపేసి విస్తృతంగా రీడర్ కి చేరుకోవాలని డిజిటల్ మార్గాన్ని ఉపాన ఎంచుకుంది. యు ఆర్ లైఫ్ వేదికగా ఎంతో ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందిస్తూ కీలకమైన విభాగానికి ఉపాసన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఉపాసన రీసెంట్‌గా గత నెల 23న హైదరాబాద్ అపోలోలో క్లీం కార అనే పాపకు జన్మనిచ్చింది. ఏదేమైనా ఉపాసనకు సోషల్ మీడియాలో కూడా తిరుగులేని ఫాలోయింగ్ ఉంది.