మెగా వారసురాలు ఎవరి పోలికో చెప్పేసిన రామ్ చరణ్… పాపతో ఇంటికి బయలుదేరిన ఉపాసన..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులకు పెళ్లి జ‌రిగిన 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 20న ఉపాసన అపోలో హాస్పిటల్ లో పండంటి పాపకు జన్మనిచ్చింది. మెగాఫ్యామిలీలోకి బుల్లి మహాలక్ష్మి రావటంతో మెగా అభిమానులు ఎంతో ఆనందంగా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ దంపతులకు స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈరోజు కొద్దిసేపటికి క్రితమే ఉపాసన హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయింది. రామ్ చరణ్- ఉపాసన తమ బిడ్డతో హాస్పటల్ నుంచి బయటికి వచ్చి తమ ఇంటికి బయలుదేరారు. కూతురు మొహాన్ని మాత్రం బయటికి క‌నిపించ‌కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే సమయంలో ఇంటికి వెళ్లబోయే ముందు రామ్ చరణ్ అక్కడ మీడియా వారితో చిట్ చాట్ చేశారు.

అక్కడున్న మీడియా మిత్రులతో మాట్లాడుతూ రామ్ చరణ్.. ఉపాసన, పాప ఇద్దరు ఎంతో హెల్తీగా ఉన్నారని.. తమకు విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. అలాగే ఉపాసన మరియు పాపకి వైద్యం చేసిన డాక్టర్లు అందరికీ థాంక్స్ చెప్పాడు. తమ పాపకు అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నాడు.

అదే సమయంలో కూతురికి ఏం పేరు పెడతారని ప్రస్తావన రాగా.. నేను ఉపాసన ఒక పేరును డిసైడ్ అయ్యామని కానీ అది 21వ రోజున అనౌన్స్ చేస్తానని రామ్ చరణ్ స్వయంగా చెప్పాడు. అలాగే మీ పాప ఎవరి పోలికలో ఉందని వచ్చిన ప్రశ్నకు.. అచ్చం నాన్న చిరంజీవి లాగానే ఉందని రామ్ చరణ్ చెబుతూ మురిసిపోయాడు. ఇప్పుడు చరణ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.