టీవీ 5 మూర్తి అంటేనే పెద్ద సంచలనం. టీవీ చర్చల్లో పొలిటికల్ గా తనదైన వాయిస్ వినిపిస్తూ ఉంటారు. మూర్తి ఇంటర్వ్యూలు అంటేనే ఓ సంచలనం రేపుతూ ఉంటాయి. ఎలాంటి బెదిరింపులు ఎదురైనా, అదరడు.. బెదరడు అన్న పేరు ఉంది. అలాంటి మూర్తి ఇప్పుడు మరో సంచలనానికి రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది. మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారుతున్నాడు. అది కూడా పొలిటికల్ సబ్జెక్ట్ కావడం మరో విశేషం.
టీవీ 5 మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏపీలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో మాంచి పొలిటికల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నారా రోహిత్‌కు ఇది కం బ్యాక్ ఫిల్మ్ కానుంది. నారా రోహిత్ వైవిధ్యమైన కథాంశాలతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. రోహిత్ సినిమాలు కమర్షియల్‌గా ఎంత వరకు వర్కవుట్ అవుతాయన్నది పక్కన పెడితే ఎంచుకునే కథలకు, మనోడి నటనకు మాత్రం ప్రతి సినిమాకు మంచి మార్కులే పడుతున్నాయి.
ఈ క్రమంలోనే రోహిత్‌తో ఇప్పుడు మూర్తి పొలిటికల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారన్న వార్త బయటకు రావడంతో ఇది ఖచ్చితంగా ఏపీలో అధికార వైసీపీతో పాటు ముఖ్యమంత్రి జగన్ పాలనా విధానాలను టార్గెట్ చేసేదిగా ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమాతో రోహిత్ – మూర్తి సంచలనాలకు తెరలేపేలా ఉన్నారు