థ‌మన్ పై దారుణమైన ట్రోలింగ్.. అతని భార్య ఏం చేసిందో తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు..!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్. తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన థ‌మన్ ఓ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడంటే అది కచ్చితంగా చార్ట్‌ బస్టర్ అవుతుంద‌నేంత‌ బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. దానికి ఒక‌ కారణం కూడా ఉంది. సినిమాలో ఉన్న సన్నివేశం ఏదైనా కానీ ఓ రేంజ్ లో ఎలివేట్ చేయడంలో 100% న్యాయం చేస్తాడు థ‌మన్.

Music Director Thaman : థమన్ భార్యను ఎప్పుడైనా చూసారా.. ఆవిడ ఎలా ఉంటారో  తెలుసా.. Music Director Thaman interesting comments on his wife vardhini  goes viral– News18 Telugu

అందుకే ప్రతి స్టార్ హీరో తన సినిమాకు థ‌మన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలని ప‌ట్టుబ‌డుతుంటారు. స్టార్ డైరెక్ట‌ర్ల ఓటు కూడా థ‌మ‌న్‌కే..! థ‌మన్ తమకు ఎంత మంచి గుర్తింపు వుందో.. అలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్, నెగెటివిటీ కూడా అదే రేంజ్ లో ఉంది. నెగిటివ్ ట్రోల్స్ తట్టుకోలేని థ‌మన్ గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు.

థ‌మన్ భార్య వర్ధిని కూడా ప్లే బాక్స్ సింగ‌ర్. ఈటీవీలో స్వరాభిషేకం ప్రోగ్రాం ద్వారా ఈమె సింగర్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని సినిమాలకు పాటలు పాడింది వర్దిని. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ధిని థ‌మన్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ పై స్పందించింది. మేమిద్దరం అసలు ట్రోలింగ్స్ , నెగెటివిటీస్ గురించి ఇంట్లో మాట్లాడుకోం.. కానీ ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలు, కంపోజ్ చేసిన సాంగ్స్ కింద నెగ‌టివ్ కామెంట్లు చూస్తే ఆ రోజంతా మూడ్ స్పాయిల్ అయిపోతుంద‌ని వాపోయింది.

Thaman About His Wife And Son Says Doing Stage Shows With Wife - Sakshi

అలా చాలాసార్లు ఫుడ్ కూడా తినలేకపోయానని… అప్పటినుంచి నేను.. థ‌మన్ యూట్యూబ్ వీడియోస్, వాటి కింద ఉన్న కామెంట్లు చూడడం మానేశానని చెప్పుకొచ్చింది వర్ధిని. థ‌మన్ పై అంత నెగటివ్ ట్రోలింగ్ జరిగినా ఆ కామెంట్స్‌పై నెగిటివ్‌గా స్పందించకుండా వర్థిని అస‌లు ఆ కామెంట్స్ చూడడం మానేయ‌డం నిజంగా మంచి డెసిష‌న్ అని అంటున్నారు. అలా చేస్తే ఇంట్లో మంచి వాతావ‌ర‌ణం, మూడ్ ఉండ‌డంతో పాటు థ‌మ‌న్ వ‌ర్క్ మ‌రింత ఎలివేట్ అవుతుంద‌ని.. ఆమెకు దండం పెట్టేల్సిందే అంటూ ఆమె ఇంట‌ర్వ్యూపై కామెంట్లు ప‌డుతున్నాయి.